Bengaluru Teacher Arrest: సమాజంలో ఇప్పటికే ఎవరికైనా గౌరవం ఉందంటే, అది టీచర్లకు మాత్రమే. కానీ, విద్యా బుద్దులు నేర్పించాల్సిన టీచర్లు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజంలో మంచి ఏదో, చెడు ఏదో చెప్పాల్సిన వాళ్లే వెకిలి వేషాలు వేస్తున్నారు. సమాజం ముందు తలదించుకుని నిలబడుతున్నారు. తాజాగా ఓ కిలాడీ టీచర్ విద్యార్థి తండ్రికి వలపు వల విసిరింది. తన అందం చందాలతో అతడిని బుట్టలో వేసుకుంది. ముందు అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత తన అసలు బుద్ధిని బయటకు పెట్టింది. ప్రైవేట్ ఫోటోలను బయటపెడతానుంటూ బ్లాక్ మెయిల్ చేసింది. ఎక్కడ పరువు పోతుందోనని సదరు విద్యార్థి తండ్రి లక్షల రూపాయలు ఇచ్చాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిని ఇంకా డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేసింది. టీచర్ వేధింపులు రోజు రోజుకు తీవ్రం కావడంతో పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలాడీ టీచర్ తో పాటు ఆమెకు సహకరించిన వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
గుజరాత్ కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ భార్య, పిల్లలతో కలిసి వెస్ట్ బెంగళూరులో ఉంటున్నారు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ ప్రీ ప్రైమరీ స్కూల్ లో 2023లో తన పిల్లలను చేర్చించాడు. అడ్మిషన్ సమయంలో అతడికి శ్రీదేవి రుడాగి(25) అనే లేడీ టీచర్ పరిచయం అయ్యింది. ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇద్దరూ చాటింగ్ చేసుకోవడం మొదలు పెట్టారు. నెమ్మదిగా వీడియోల్స్ చేసుకునే వాళ్లు. నెమ్మదిగా ఇద్దరు మరింత దగ్గరయ్యారు. అతడితో కలిసి నెమ్మదిగా సినిమాలకు, షికార్లకు వెళ్లింది. మరింత చనువుగా ఉండటం మొదలు పెట్టారు. విద్యార్థి తండ్రితో చనువుగా ఉన్న ఫోటోలు, వీడియోలను రికార్డు చేసింది. కొద్ది కాలం తర్వాత టీచర్ శ్రీదేవిలోని అసలు కోణం బయటకు వచ్చింది. అతడి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది. రూ. 4 లక్షలు ఇవ్వాలని బెదిరించింది. ఆమె మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మరింతగా వేధించడం మొదలుపెట్టింది. వాళ్లను సైబర్ క్రైమ్ పోలీసులుగా పరిచయం చేసింది. ఆ తర్వాత మరో రూ. 15 లక్షలు డిమాండ్ చేసింది.
వేధింపులు భరించలేక.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
సదరు టీచర్ నుంచి బ్లాక్ మెయిలింగ్ ఎక్కువ కావడంతో తన ఫ్యామిలీని గుజరాత్ కు మార్చాలి విద్యార్థి తండ్రి అనుకున్నాడు. పిల్లల టీసీల కోసం స్కూల్ కు వెళ్లాడు. ఈ విషయం టీచర్ కు తెలియడంతో ఇద్దరు వ్యక్తులను వెంటనేసుకుని వెళ్లి మరోసారి బెదిరించింది. రూ. 20 లక్షలు ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఫ్యామిలీ మెంబర్స్ కు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. భయపడ్డ బాదితులు 1.9 లక్షలను ఫోన్ పే ద్వారా చెల్లించాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని వేధించడంతో అతడు తట్టుకోలేకపోయాడు. నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలాడీ టీచర్ శ్రీదేవితో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోర్టు వారికి రిమాండ్ విధించండతో జైలుకు తరలించారు.
Read Also: 9 ఏళ్ల బాలుడు.. 2 ఏళ్లుగా ఇంట్లో ఒంటరి జీవితం, అతడి తల్లిదండ్రులు ఏమయ్యారు?