BigTV English

Tale of France Boy: 9 ఏళ్ల బాలుడు.. 2 ఏళ్లుగా ఇంట్లో ఒంటరి జీవితం, అతడి తల్లిదండ్రులు ఏమయ్యారు?

Tale of France Boy: 9 ఏళ్ల బాలుడు.. 2 ఏళ్లుగా ఇంట్లో ఒంటరి జీవితం, అతడి తల్లిదండ్రులు ఏమయ్యారు?

తల్లి తన పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. తను ఎన్ని కష్టాలు పడ్డా పిల్లలు బాగుండాలని కోరుకుంటుంది. తను ఆకలితో అలమటించినా పిల్లలకు కడుపునిండా తిండి పెట్టాలి అనుకుంటుంది. గాడిదయ్యో, బూడిదయ్యో చివరి వరకు పిల్లలను చూసుకుంటుంది. కానీ, కొంత మంది తల్లులు అత్యంత దయనీయంగా వ్యవహరిస్తారు. పరాయి మగాళ్ల మోజులో పడి కన్న పిల్లలను, కట్టుకున్న మొగుళ్లను చంపే మహా తల్లులు ఎంతో మంది ఉన్నారు. తాజాగా అలాంటి ఓ తల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఉండేందుకు 9 ఏండ్ల బాలుడిని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయింది. 2 సంవత్సరాలుగా ఆ పిల్లాడు ఇంట్లో ఒంటరిగా గడిపాడు. చివరకు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.


2 ఏండ్లుగా ఇంట్లో ఒంటరిగా..

ఫ్రాన్స్‌ లోని నెర్సాక్‌ కు చెందిన అలెగ్జాండ్రాకు గతంలోనే పెళ్లి అయ్యింది. ఆమెకు ఓ కొడుకు పుట్టాక భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కొడుకును చూసుకుంటూ జీవించింది. సుమారు మూడు సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి పిల్లాడి సంగతేంటి? ఎటుపోతే తనకేంటి అనుకుంది. అతడిని ఇంట్లోనే వదిలేసి, ప్రియుడితో వెళ్లిపోయింది. సమీపంలోని సిరుయిల్ నగరంలోని హాయిగా నచ్చిన వాడితో ఎంజాయ్ చేస్తోంది.


ఇక ఆ పిల్లాడికి ఏం చేయాలో తెలియలేదు. రెండు సంవత్సరాలుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. 2020 నుంచి 2022 వరకు ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఇంట్లో ఉన్న స్వీట్లు, డబ్బాల్లో ఉన్న ఆహారం. పక్కింట్లో వారి సాయంతో జీవించాడు. అతడి తల్లి అప్పుడప్పుడు అతడికి ఆహారం తీసుకురావడానికి వచ్చేది. కానీ, ఎప్పుడూ అతడిని ఆమె వెంట తీసుకెళ్లలేదు. అదే సమయంలో ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంది. పిల్లాడు రోజూ ఒంటరిగానే స్కూల్ కు వెళ్లేవాడు. సుమారు 2 ఏండ్ల తర్వాత పొరుగువారికి అనుమానం కలిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

ఆ బాలుడు ఉంటున్న  ఇంటికి పోలీసులు వచ్చారు. ఫ్లాట్ లో ఖాళీ ఫ్రిజ్, కేక్ బాక్సులతో నిండిన చెత్తబుట్ట, ఫుడ్ పార్శిల్స్ కు సంబంధించిన ఖాళీ బాక్సులు చూసి ఆశ్చర్యపోయారు. నెలల తరబడి ఫ్లాట్‌ లో పెద్దలు ఎవరూ లేరని దర్యాప్తులో తేలింది. రెండేళ్లుగా తాను ఒంటరిగా నివసిస్తున్నానని బాలుడు చెప్పాడు. తన తల్లి అప్పుడప్పుడు వచ్చి ఫుడ్ ఇచ్చి పోతుందని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి తల్లి అలెగ్జాండ్రా(39)ను సిరుయిల్ లోని తన ప్రియుడి ఇంట్లో కనుగొన్నారు. ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. అక్కడ కూడా ఆమె తన తప్పును ఒప్పుకోలేదు. అసలు ఆ బాలుడు తన కొడుకే కాదని వాదించింది. అయినప్పటికీ తాను అతడిని రోజూ స్కూల్ లో దింపేదానినని చెప్పింది. కానీ, ఆమె చెప్పేది నిజం కాదని పోలీసులు నిరూపించారు. ఈ నేపథ్యంలో పిల్లాడిని రెండు ఏండ్ల పాటు హింసించిన తల్లికి 18 నెలల సస్పెండ్ జైలుశిక్ష విధించింది కోర్టు. అంటే, ఆమెను జైల్లో వేయరు కానీ, పోలీసు షరతుల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.  అటు ఆ పిల్లాడు ఇంట్లో ఒంటరిగా ఉన్నా, రెగ్యులర్ గా స్కూల్ కు వెళ్లేవాడు. చక్కగా చదివే వాడని ఉపాధ్యాయులు చెప్పారు.

Read Also: తండ్రి పాడె మోస్తూ కొడుకు మృతి, ఇద్దరినీ ఒకే చోట..

Related News

Instagram love: ప్రియురాలిని చంపి.. సూట్‌కేస్‌లో బాడీని కుక్కి.. సెల్పీ తీసుకున్న ప్రియుడు.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Heart Attack: పుట్టినరోజు నాడే చావు.. బతుకమ్మ ఆడుతూ కుప్పకూలి మహిళ

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Medipally Incident: దారుణం.. సీనియర్ల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య..

Gas Cylinder Blast: ఒకేసారి పేలిన గ్యాస్ సిలెండర్, వాషింగ్ మిషన్.. ముగ్గురికి తీవ్రగాయాలు

Son Kills Parents: పిఠాపురంలో దారుణం.. ఇద్దరిని చంపేసి.. బావిలో తోసి ఎందుకు చంపాడంటే!

Visakhapatnam Youth Suicide: ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్

Hyderabad News: ఆడ వేషం వేసుకుని.. ఫ్రెండ్ ఇంట్లో చోరి, ఇదిగో ఇలా దొరికిపోయాడు!

Big Stories

×