E-Paper
Advertisement

Lucknow Crime: లంబోర్ఘిని కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిన యువకుడు, వ్యాపారి కొడుకుపై కేసు

Lucknow Crime: లంబోర్ఘిని కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిన యువకుడు, వ్యాపారి కొడుకుపై కేసు
Advertisement

Lucknow Crime: దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ మధ్య లగ్జరీ కార్లు కనిపిస్తున్నాయి. బడాబాబుల పుత్రరత్నాలు వాటిని డ్రైవింగ్ చేస్తుకుంటూ రయ్ రయ్ మంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఆయా కార్లు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా కాన్పూర్‌లో బడా వ్యాపారి కొడుకు మద్యం మత్తులో లంబోర్ఘిని కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.  అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాన్పూర్‌లోని వీఐపీ రోడ్డులో లంబోర్ఘిని కారు బీభత్సం

Advertisement

యూపీలోని కాన్పూర్‌ సిటీలో లంబోర్ఘిని కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కొడుకు శివమ్ మిశ్రా కారుతో వేగంగా డ్రైవింగ్ చేశాడు. చివరకు ఆ కారు అదుపు తప్పి పలు వాహనాలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. గ్వాల్‌ టోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఐపీ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.

తొలుత బైక్‌ను ఢీ కొట్టిన కారు, ఆ వేగానికి బైకర్ 10 అడుగుల ఎత్తున గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. పొగాకు వ్యాపారి కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా ఘటన సమయంలో వాహనాన్ని నడిపాడు. సమీపంలోని రెవ్-3 మాల్ వద్దకు రాగానే వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ఆ తర్వాత పక్కన ఆపి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని బలంగా హిట్ కొట్టింది. ఆ తర్వాత బైక్‌ను కొంత దూరం ఈడ్చుకెళ్లింది కారు.

Advertisement

కారు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు, గాల్లోకి ఎగిరిన బైక్ రైడర్

చివరకు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన తర్వాత కారు ఆగింది. గాయపడిన బాధితులను వెంటనే ట్రీట్‌మెంట్ కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు కాన్పూర్ సెంట్రల్ డీసీపీ తెలిపారు. గాయపడిన వారికి ప్రాథమిక చికిత్స అందించామని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఘటన తర్వాత శివమ్ మిశ్రాను అతడి వెనుక వస్తున్న బాడీగార్డులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బడా బాబు కొడుకు కావడంతో కేసు నమోదులో జాప్యం చేశారనే ఆరోపణలు బలంగా వినిపించాయి. లంబోర్ఘిని కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు. ప్రత్యక్ష సాక్షుల వెర్షన్ మరోలా ఉంది. లంబోర్గిని కారును అధిక వేగంతో నడుపుతున్నాడని, డ్రైవర్ శివం మిశ్రా మద్యం సేవించి ఉన్నాడని చెబుతున్నారు.

ALSO READ: నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు

ఘటన తర్వాత కారు ఆపడానికి బదులుగా, మిశ్రా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని చెప్పారు. బౌన్సర్లు అతడ్ని కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదు. కోపంతో ఉన్న స్థానికులు లంబోర్గిని కారు అద్దాలు పగలగొట్టి మిశ్రాను బయటకు తీశారు. 10 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ కారు, RTO కోడ్ ప్రకారం వాయువ్య ఢిల్లీలోని రోహిణిలో రిజిస్టర్ చేశారు. కారు తీవ్రంగా దెబ్బతింది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×