Bengaluru: బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. ఓ మహిళ తన 13 ఏళ్ల కూతుర్ని దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తన నివాసంలో తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడంది. ఈ ఘటన సమయంలో మహిళ భర్త డ్యూటీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరు వైట్‌ఫీల్డ్ సమీపంలో ఘోరం
బెంగళూరు సిటీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కూతురిని కన్నతల్లి కిరాతకంగా హతమార్చింది. ఆ తర్వాత ఆ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైట్‌ఫీల్డ్ పీఎస్ పరిధిలోని ఇమ్మెడిహళ్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మృతుల్లో తల్లి పేరు సువర్ణ కాగా, ఆమె వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటాయి. ఇక కూతురు కారుణ్య కాగా, యువతి వయస్సు దాదాపు 14 ఏళ్లు.
సువర్ణ-చంద్రశేఖర్ దంపతులు బెంగుళూరులో నివాసం ఉంటున్నారు. అయితే చంద్రశేఖర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. కారణాలు ఏంటో తెలీదు. మంగళవారం యథావిధిగా చంద్రశేఖర్ డ్యూటీకి వెళ్లిపోయాడు. డ్యూటీ నుంచి భార్యకు అతడు ఫోన్ చేశాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
కుమార్తెను చంపి, ఆపై తల్లి ఆత్మహత్య.. రంగంలోకి దిగిన పోలీసులు
అనుమానం వచ్చి దగ్గరలో ఉన్న తన సోదరుడిని ఇంటికి వెళ్లమని చెప్పాడు చంద్రశేఖర్. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అతడు ఇంటికి వెళ్లాడు. గదిలో కారుణ్య విగతజీవిగా పడి కనిపించింది. సువర్ణ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే చంద్రశేఖర్ ఒక్కసారిగా షాకయ్యాడు.
ఈ ఘటన జరిగిన సమయంలో చంద్రశేఖర్ విధుల్లో ఉన్నాడు. ఘటనకు సమాచారం అందుకున్న వెంటనే వైట్‌ఫీల్డ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూతుర్ని గొంతు నులిమి చింపేసి, ఆ తర్వాత సువర్ణ ఆత్మహత్య చేసుకోవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ALSO READ: బిచ్చమే కదా అని వేస్తే.. ప్రాణాల మీదకు తెచ్చాడు, జస్ట్ రూ.5 కోసమే కత్తి పట్టుకుని..?
ఈ ఘటన వెనుక ఆర్థిక సమస్యలు కారణమా? సువర్ణ మనోవేదనకు గురైందా? ఫ్యామిలీ సమస్యలా ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. తన కుమార్తెను భార్య హత్య చేసిందని భర్త చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సువర్ణ మృతిపై ఆమె సోదరుడు మంజునాథ్ అనుమానాలు వ్యక్తం చేశాడు.
దీనిపై ఆయన కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక సమస్యల వల్ల సువర్ణ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చిన ఆమె సోదరి ఉష అనుమానం వ్యక్తం చేసింది. కొన్నాళ్ల కిందట ఫ్యామిలీని నడపడం కష్టంగా ఉందని తన అక్క సువర్ణ చెప్పినట్లు ఆమె తెలిపారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.