E-Paper
Advertisement

Student Suicide: మోహన్ బాబు యూనివర్సిటీ ఇష్యూ.. ఇంతకీ సూసైడా.. మర్డరా..?

Student Suicide: మోహన్ బాబు యూనివర్సిటీ ఇష్యూ.. ఇంతకీ సూసైడా.. మర్డరా..?
Advertisement

Student Suicide: తిరుపతి జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీలో తీవ్ర విషాదం నెలకొంది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న భువన అనే విద్యార్థిని క్యాంపస్‌లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన ఈ యువతి, తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఇలా తనువు చాలించడం తోటి విద్యార్థులను, స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

యాజమాన్యం, పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకోని రియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఘటనపై విద్యార్థిని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత బలహీన మనస్కురాలు కాదని, ఇది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. కళాశాల ప్రాంగణంలో ఏం జరిగిందో స్పష్టంగా బయటపెట్టాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. దీనిని అనుమానాస్పద మృతిగా పరిగణిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప అసలు కారణాలు తెలియవని అధికారులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, భువన స్నేహితులను, తోటి విద్యార్థులను విచారిస్తున్నారు.

Also Read: ప్రోఫైల్ చూసి పెళ్లికి రెడీ అయితున్నారా.. అయితే మీరు డేంజర్‌లో పడ్డారండోయ్..?

Advertisement

ఈ ఘటనతో మోహన్ బాబు యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక మెరిటోరియస్ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం వెనుక ఉన్న కారణాలను వెలికితీయాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. పోలీసుల లోతైన విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×