Bolivia Bus Accident: బొలీవియాలోని పోటోసి ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 39 మంది తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ మద్యం సేవించి, అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాదం నుండి బయటపడిన డ్రైవర్లలో ఒకరు ఈ ఘటనకు ముందు మద్యం సేవించి ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు. కొంతమంది ప్రయాణికులు అతను మద్యం సేవించడాన్ని చూసినట్లు తెలిపారు.
అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఉయుని కొల్చాని రహదారిపై వెళ్తున్న రెండు బస్సులు ఢీ కొన్నాయి. వీటిలో ఓ బస్సులు లోయలోకి దూసుకెళ్లింది. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. నల్లగొండ జిల్లా చిట్యాలలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బసు, కార్, కంటైనర్, కారు ఒకదాని వెనక ఒకటి నాలుగు వాహనాలు ఢీ కొట్టాయి. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Also Read: అయితే మేము సోషల్ మీడియా యాప్ తీసుకొస్తాం.. మెటా ఏఐ యాప్ వార్తలపై ఆల్ట్ మన్
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వెయ్యడంతో వెనక ఉన్న కార్ ని కంటైనర్ బలంగా ఢీకొట్టింది. దీంతో కారు బస్ కిందికి వెళ్లిపోయింది. మరో కారు అదుపు తప్పి డివైడర్ మీదికి వెళ్లింది. ఈ ఘటనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు పోలీసులు.