BigTV English

Maruti Alto K10: ఆల్టో కే-10 పై మారుతి దృష్టి.. ఏంటి ఆ ఫీచర్లు

Maruti Alto K10: ఆల్టో కే-10 పై మారుతి దృష్టి.. ఏంటి ఆ ఫీచర్లు

Maruti Alto K10: ఆటో‌ మోటివ్ సెక్టార్‌లో విపరీతమైన పోటీ పెరిగింది. మార్కెట్‌ని సొంతం చేసుకునేందుకు కార్ల కంపెనీ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో ప్రతీ ఏడాది వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లతో కార్లకు రిలీజ్ చేస్తున్నాయి ఆయా కంపెనీలు. ఈ విషయంలో మారుతి కార్ల కంపెనీ ఓ అడుగు ముందే ఉందని చెప్పవచ్చు.


భారత్ మార్కెట్లో ఫ్యామిలీ కార్లకు మాంచి డిమాండ్ ఉంది. భార్యభర్తలు, ఇద్దరు పిల్లలకు ఓ చిన్న కారు ఉంటే బాగుంటుందని చాలామంది ఆశిస్తున్నారు. మిడిల్ క్లాస్ ఆలోచనలకు అనుగుణంగా ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. రూ. 4.23 లక్షల నుంచి రూ.10 లక్షల బడ్జెట్ వరకు మార్కెట్లో లభిస్తున్నాయి.

ఈ ఏడాదిలో మారుతి ఆల్టో-K10 కొత్త వేరియంట్‌ని మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే మారుతి కార్లలో ఆల్టోకు మించినది మరొకటి లేదన్నది కొందరు వినియోగదారులు మాట. వారి అంచనాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి కొత్త వేరియంట్లతో వారిని మార్కెట్లోకి తెస్తోంది మారుతి.


మారుతి ఆల్టో -K10 కొత్త  వేరియంట్‌ విషయానికొద్దాం. ఆల్టో- K10 ప్రారంభం ధర రూ. 4.23 లక్షల నుండి రూ. 6.21 లక్షల వరకు ఉండబోతోంది. కాకపోతే కొన్ని ఫీచర్లను అందుబాటులోకి రానున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అందుబాటులో ఉండనుంది. ఆల్టో K10 ఎలాంటి యాంత్రిక లేదా సౌందర్య పరమైన మార్పులు చేయలేదని సమాచారం. వినియోగదారులకు మరింత సురక్షితంగా ఉండనుంది.

ALSO READ: వీటికి మార్చి 31 లాస్ట్ ఛాన్స్

కొత్త మారుతి ఆల్టో -K10లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌ వంటి కొత్త ఫీచర్లు ఉండనున్నాయి. గతంలో రెండు స్పీకర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు నాలుగు స్పీకర్లతో రానుంది. 

ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. గతంలో మాదిరిగా 998 సీసీ, త్రీ-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో రానుంది. ఇది 5,500 ఆర్పీఎం వద్ద 65 బీహెచ్పీ గరిష్ట, 3,500 ఆర్పీఎం వద్ద 89 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ తో జత చేయబడింది.

ఇక్కడ ఫీచర్లు పెరిగినకొద్దీ ధరల్లో చిన్నపాటి వ్యత్యాసం కనిపించనుంది. పైన చెప్పిన ఫీచర్లతో కావాలంటే రూ.5.60 లక్షల పైమాటే. ఆల్టో-కె10 నార్మల్ కారు కావాలంటే కేవలం నాలుగున్నర లక్షలు మాత్రమే. గతంలో నాలుగు లక్షల 10 వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 14 వేలు పెరిగిందన్నమాట.

మారుతి సుజుకి ఆల్టో- కే10 సీఎన్జీ మోడల్ ఉంది. సీఎన్జీ‌పై పని చేస్తున్నప్పుడు, గరిష్ట శక్తి 5,300 ఆర్పీఎం వద్ద 55 బీహెచ్పీ‌కు తగ్గుతుంది. 3,400 ఆర్పీఎం వద్ద 82.1 ఎన్ఎం గరిష్ట టార్క్ ఉండనుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడింది. సీఎన్జీలో ఎలాంటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ లేదు.

పెట్రోల్ కారు లీటర్‌కి 24 నుంచి 33.85 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుందని ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అదే సీఎన్​జీ కారు అయితే దాదాపు 33 కిలోమీటర్ల పైమాటేనని అంటున్నారు. కాకపోతే సీఎన్డీకి వచ్చేసరికి ధర కూడా పెరుగుతుందన్నది విషయాన్ని వినియోగదారులు గమనించాలి.

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×