Satyabhama Today Episode March 2nd : నిన్నటి ఎపిసోడ్లో.. క్రిష్ రాత్రి తాగేసి ఇంటికి వస్తాడు. క్రిష్ ను అలా చూసి సత్య కన్నీళ్లు పెట్టుకుంటుంది.. తాగేసి వస్తావని నేను అస్సలు అనుకోలేదు నీకు బాధ ఉంది తప్పు కాదు కానీ ఇలా తాగేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవడం అవసరమా అని సత్య అంటుంది. ఇకనుంచి మనిద్దరం ఇక్కడే ఉండాలని సంగతి నువ్వు మర్చిపోతున్నావు క్రిష్ అతను నీ బాపు కాదు ఇదే మన ఇల్లు ఇక్కడే మనం ఉండాలి అని సత్య క్లారిటీగా చెప్తుంది. కానీ క్రిష్ మాత్రం మా బాబు కోపం తాటాకుమట్ట లాంటిదే అలా వస్తుంది తర్వాత తగ్గుతుంది. ఇక క్రిష్ మాత్రం బాపు మీద ప్రేమను చంపుకోలేక బాపు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కారణం నేనే.. నేను రెచ్చగొట్టడం వల్లే ఇది నిజం బయటపడింది దాన్నే నువ్వు సహించలేకపోతున్నావని సత్య బాధపడుతుంది. బాపు ఫోన్ చేస్తే నన్ను లేపు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బాధపడతాడని సోఫాలోనే పడుకుండిపోతాడు క్రిష్ మైత్రి ఫోన్ రావడం చూసి నందిని షాక్ అవుతుంది. ఇది ఎందుకు నీకు ఫోన్ చేస్తుందని అడుగుతుంది. ఫారిన్ వెళ్లాలని ఉంది కదా ఆ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటుందేమో అని మైత్రి ఫోన్ లిఫ్ట్ చేయబోతాడు హర్ష అయితే నందిని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని అడుగుతుంది. మైత్రి నందిని కి డౌట్ రాకుండా డాక్యుమెంట్స్ కోసం ఫోన్ చేస్తుంది. నేను ఇంకొక రెండు రోజుల్లో తెచ్చిస్తానని హర్ష అంటాడు. నిద్రమంటే ఏదో జరుగుతుంది అని అనుమానం నాకు వచ్చిందంటే చాలు ఇక నేను ఏం చేస్తున్నా నాకు తెలియదని ఇండైరెక్టుగా నందిని వార్నింగ్ ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. సత్య మహదేవయ్య ఇంటికెళ్లి కృష్ణ దారిలోకి తీసుకురావాలని వేడుకుంటుంది. ఆ ఇంట్లో ఒక జయమ్మ తప్ప ఎవరు కూడా క్రిష్ ను అర్థం చేసుకోరు. మీరు గుండెల్లో ఉంచి వదిలేసిన కూడా తను మాత్రం మీరే తనకు దైవమని భావిస్తున్నారు మావయ్య మీరు ఒకసారి ఆయనతో మాట్లాడండి అని సత్య వేడుకుంటుంది కానీ మహదేవయ్య మాత్రం మీ మామ నా కొడుకు నా ఇష్టం అని తీసుకెళ్లాడు కదా ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు ఇకనుంచి వెళ్ళు అనే సత్యను బయటికి పంపించేస్తారు. మీకు చిన్నప్పటినుంచి ఎవరు ఎలాంటి హాని తల పెట్టాలని చూసినా కూడా అడ్డుగా నిలబడి మీ ప్రాణాలకు తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు..
మహదేవయ్య గుండె కరగదు కానీ సంజయ్ మాత్రం సత్యను తిడతాడు. ఇక సత్య చెప్పిన మాటలు ఆ ఇంట్లో ఎవరూ వినరు దాంతో క్రిష్ ఏమైపోతాడు అని బాధతో బయటికి వచ్చేస్తుంది. మీరు వదిలేసి ఉన్నంతగా క్రిష్ మిమ్మల్ని వదిలేయకపోతున్నాడు.. ఏదో ఒక రోజు మీరు అన్ని పోగొట్టుకునే రోజు క్రిష్ ఏ మీకు అండగా నిలబడతాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అనేసి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
ఇంట్లో మనుషులు రాక్షసుడు లాగా ఉన్నారు అందరూ రాళ్ళలాగే ఉన్నారు నేను ఎంతగా బ్రతిమలాడినా కూడా కొంచెం కూడా కరగలేదు క్రిష్ ఏమైపోతాడు అని సత్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్లి క్రిష్ బాధపడుతుంటే ఈ విషయాన్ని బయటకు చెప్తుంది. కానీ క్రిష్ మాత్రం సత్య చెప్తుంది అబద్ధమని నమ్మడు. మా బాపు అలా చేస్తాడంటే నేను అసలు నమ్మను నువ్వు కావాలనే మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నావ్ అని కృషి సత్యమే అంటాడు సత్య ఎన్ని సార్లు చెప్పినా కూడా క్రిష్ తన మాట వినడు.
నా గుండెల్లో బాపు మాత్రమే ఉన్నాడు. అస్సలు వేరే ఆలోచన రావడం లేదని భాద పడతాడు. ఇక అర్ధరాత్రి అవగానే బాపుని ఒకసారి చూడాలని మహదేవయ్య ఇంటికి వెళ్తాడు. మహదేవ భైరవిన్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు క్రిష్ అయితే క్రిష్ రావడం చూసిన సంజయ్ దొంగ దొంగ అని అరుస్తాడు. అతని మహదేవ మనుషులు పట్టుకుంటారు నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు రా అంటే నేను బాబును చూడాలని వచ్చాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటే బాపును చూడాలని వచ్చావో ఇంకా ఏదైనా తీసుకెళ్లాలని వచ్చావు అని భైరవి అంటుంది. ఇక మహదేవయ్య చూస్తారేంట్రా విని బయటకు తోసేయండి అనేసి అంటాడు.. అక్కడితో ప్రోమో కట్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..