BigTV English

Brother In Law Kills: వదిన ఆ పని చేసిందని రెండు హత్యలు చేసిన మరిది.. దుబాయ్ వెళుతుండగా అరెస్ట్..

Brother In Law Kills: వదిన ఆ పని చేసిందని రెండు హత్యలు చేసిన మరిది.. దుబాయ్ వెళుతుండగా అరెస్ట్..

Brother In Law Kills| పగ ప్రతీకారాలతో కళ్లు మూసుకుబోయి ఒక వ్యక్తి తన వదిన, మూడు నెలల పసికందుని హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. గాజియాబాద్ లో నేషనల్ హైవే-9 సమీపంలో బమ్‌హేటా ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక యువతి, ఆమె పసిబిడ్డ హత్యకు గురయ్యారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేసి 24 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు. అయితే నిందితుడు మరెవరో కాదు హత్యకు గురైన యువతికి స్వయాన మరిది.

పోలీసుల కథనం ప్రకారం.. బమ్‌హేటా ప్రాంతంలో ముహమ్మద్ బుర్హాన్ (37) , అతని భార్య షషీన్ పర్వీన్ నివసిస్తున్నారు. వారిద్దరికీ మూడు నెలల క్రితమే ఒక పాప పుట్టింది. ఈ క్రమంలో ముహమ్మద్ బుర్హాన్ సోదరుడు ముహ్మమ్మద్ జీషాన్ (24) నివసిస్తున్నాడు. అయితే అతను అక్కడ పనీపాట లేకుండా ఆకతాయిగా తిరిగేవాడు. దీంతో ఇటీవల అతను ఒక వ్యక్తితో గొడవపడ్డాడు. ఆ వ్యక్తి అతని వదిన షషీన్ బంధువే. ఈ క్రమంలో జీషాన్ ఇక ఏదైనా ఉద్యోగం చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఢిల్లీలోని ఒక ఏజెంట్ తో కలిసి దుబాయ్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.


Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!

దుబాయ్ లో ఉద్యోగం కోసం రూ.1.3 లక్షలు చెల్లించాలని ఏజెంట్ అడిగాడు. ఆ డబ్బులన్నీ జీషాన్ చెల్లించేశాడు. మరో పది రోజుల్లో దుబాయ్ వెళ్లాల్సి ఉంటుందని ఏజెంట్ తెలిపాడు. అంతవరకు బెగుసరాయ్ లో జరగిన గొడవల కారణంగా జీషాన్ అక్కడ ఉండలేని పరిస్థితి. అందుకోసం పాస్ పోర్ట్ రెడీ చేసుకొని కొన్ని రోజులు తన సోదరుడు ముహమ్మద్ బుర్హాన్ ఇంటికి వచ్చాడు.

అయితే జీషాన్ తన ఇంటికి రావడం అతని వదిన షషీన్ పర్వీన్ కు నచ్చలేదు. దీంతో వారి మధ్య చిన్న గొడవలు కూడా జరిగాయి. కానీ బుర్హాన్ తన తమ్ముడి మీద ప్రేమతో అతనికి తన ఇంట్లో ఉండేందుకు అనుమతించాడు. కొన్ని రోజుల తరువాత ఆ దుబాయ్ ఉద్యోగ ఏజెంట్ మరో రూ.25000 అదరంగా ఖర్చు అవుతుందని.. వెంటనే ఏర్పాటు చేయాలని జీషాన్ కు చెప్పాడు. కానీ అప్పటికే జీషాన్ తన వద్ద ఉన్న డబ్బంతా ఏజెంట్ కు ఇచ్చేశాడు. ఇక డబ్బులు అత్యవసరం కావడంతో జీషాన్ తన అన్న బుర్హాన్ వద్ద రూ.25000 అప్పు అడిగాడు. అందుకు బుర్హాన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పాడు.

కానీ మరుసటి రోజే బుర్హాన్ తాను రూ.25000 ఇవ్వలేనని మాట మార్చాడు. దీంతో జీషాన్ తన వదిన మీద అనుమానం వచ్చింది. అన్న సాయం చేస్తానని చెప్పినా.. వదిన అడ్డుపడిందని ఆమెతో గొడవపడ్డాడు. ఆ కోపంలో రెండు రోజుల క్రితం బుర్హాన్ ఇంట్లో లేనప్పుడు షహీన్, ఆమెకు పుట్టిన మూడు నెలల పాప ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించి జీషాన్ షషీన్ కు కడతేర్చాడు. ఆమెను గొంతునులిమి చంపేశాడు. అయితే పగతో రగిలిపోయే జీషాన్ విచక్షణ మరిచిపోయి పక్కనే ఏడుస్తూ ఉన్న పసి పాపను కూడా హత్య చేశాడు. ఆ తరువాత ఇంట్లో డబ్బులు దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు.

బుర్హాన్ ఇంటికి వచ్చి చూసే సరికి తన భార్య, పసిపాప శవాలుగా కనిపించారు. దీంతో బుర్హాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తమ్ముడే ఇదంతా చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు జీషాన్ ఫోన్ ట్రాక్ చేసి అతడు దుబాయ్ వెళ్లబోతున్నాడని తెలుసుకున్నారు. వెంటనే జీషాన్ ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం షషీన్ పర్వీన్, ఆమె పుట్టిన బిడ్డను హత్య కేసు నమోదు చేసి జీషాన్ ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×