2021లో సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా వచ్చిన చిత్రం పుష్ప(Pushpa). ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ఆడియన్స్లో సరికొత్త జోష్ నింపింది. దాంతో ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పుష్ప -2 గా రాబోతున్న ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా అనూహ్య స్పందన అందుకొని, అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డ్ సృష్టించింది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించే చర్చలు జరుగుతూ ఉండడం గమనార్హం.
లాభాల్లో వాటా పొందనున్న అల్లు అర్జున్..
ఇకపోతే మరోవైపు ఈ సినిమా బడ్జెట్ తో పాటు నటీనటుల పారితోషకం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ పారితోషకం కాకుండా 28% లాభాల్లో వాటా తీసుకోబోతున్నారట. ఈ లెక్కను చూసుకుంటే 200 కోట్లకు పైగానే ఆయన ఈ సినిమా నుంచి దక్కించుకోబోతున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఇతర ఆర్టిస్టుల పారితోషకాలు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అందులో భాగంగానే విలన్ పాత్రలో నటిస్తున్న మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ (Fahad fazil) పారితోషకం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరో రేంజ్ లో ఫహద్ రెమ్యూనరేషన్..
ఇకపోతే ఈ సినిమా కోసం ఈయన తీసుకుంటున్న పారితోషకం తెలిస్తే మాత్రం నిజంగా నోరెళ్ల బెట్టాల్సిందే. పుష్ప సినిమాకి ఈయన ఏకంగా రూ .4కోట్లు పారితోషకం తీసుకుంటున్నారట. ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో పార్ట్ 2 కోసం ఈయన తన పారితోషకం మరింత పెంచినట్లు సమాచారం.ఇదిలా ఉండగా ఈ సినిమాకి సుమారుగా రూ.500 కోట్ల వరకు ఖర్చయిందని అంటున్నారు. బడ్జెట్ పెరగడానికి పారితోషకాలు పెరగడమే అంటూ దీనిని ఒక కారణంగా చెబుతున్నారు. మరోవైపు మొదటి పార్ట్ కోసం రూ .4కోట్లు తీసుకున్న ఈయన.. రెండవ భాగం కోసం రూ.8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కటింగ్స్ పోతే ఆయన చేతికి రూ.7.2 కోట్ల వరకు ముట్టిందని, ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే యంగ్ హీరో రేంజ్ లో పారితోషకం తీసుకున్నారు. వాస్తవానికి మలయాళం లో పారితోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా వీరికి తెలుగులో పెద్దగా పేరు కూడా లేదు. కాబట్టి పారితోషకం కూడా తక్కువగా ఇస్తారు. అయితే పుష్ప -2 గనుక హిట్ అయితే మాత్రం ఈయన తెలుగులో బిజీ నటుడిగా మారిపోతారు అనడంలో సందేహం లేదు. అంతే కాదు హీరోగా ఆఫర్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
పుష్ప -2 కి రెమ్యునరేషన్ పెంచిన శ్రీవల్లి..
ఈయనతో పాటు ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీవల్లిగా మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమయ్యింది. ఇక ఈమె కూడా రెండో పార్ట్ కి బాగానే పారితోషకం పెంచిందట. ఈ సినిమా కోసం రూ.10 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతోంది యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela). ఈమె కూడా ఐదు నిమిషాల పాట కోసం ఏకంగా రూ .2కోట్లు తీసుకోబోతోంది అంటూ మరో వార్త తెరపైకి వచ్చింది. మొత్తానికి అయితే నటీనటుల పారితోషకాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.