Social Activist Asha Priya: BRS సోషల్ మీడియా కార్యకర్త ఆశా ప్రియ ఆత్మహత్యాయత్నం చేసింది. సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారంటూ నిన్న మక్తల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. ఆ తర్వాత సూసైడ్ అంటెప్ట్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఆశాప్రియ అనే మహిళ బీఆర్ఎస్ కేడర్‌గా పనిచేస్తున్నది. పార్టీ కార్యక్రమాల్లోనూ ఆమె చురుకుగా పాల్గొంటున్నట్లు సమాచారం. అయితే, ఇటీవల ఆమెకు సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువ అయ్యాయి.
దీంతో ఆదివారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కటుంబ సభ్యులు వెంటనే మక్తల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆశాప్రియ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు.
కాగా.. సోషల్ మీడియా ట్రోలింగ్స్ వల్ల అమాయికుల ప్రాణాల పోగొట్టుకుంటున్నారు. ఒక్కో సందర్బంలో.. ఒక్కో ట్రోలింగ్ యువతపై వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా ఇందులో మహిళలలే ఎక్కువగా ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ సోషల్ కార్యకర్త సూసైడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ట్రోల్స్ చేసి, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్లు.
సోషల్ మీడియా ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, వీడియోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో , కొన్నిసార్లు ట్రోలింగ్‌కు కూడా గురవుతున్నారు.
Also Read: అరేయ్ ఏంట్రా ఇది.. వాళ్లని కూడా వదలరా.. సోఫియా, వ్యోమికా సింగ్, పేర్లతో ఫేక్ అకౌంట్స్
వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీల పరంగా టార్గెట్ చేసి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టు ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించుకోవాలి. తొందర పడి ఆవేశంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా ఉంటే ధైర్యంగా నిలబడి పోరాడాలి.
బీఆర్ఎస్ మహిళా కార్యకర్త ఆశా ప్రియ ఆత్మహత్యాయత్నం..
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
ఆశా ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
కేటీఆర్ అన్న ఈ చెల్లెలు పిలుపు ఇదే చివరిసారి అవుతుంది.. ఒక్కసారి పలుకు అన్నా అంటూ ఎక్స్ లో చివరి పోస్ట్
సోషల్ మీడియాలో టార్చర్ భరించలేక ఆశా… pic.twitter.com/C9ShOcIrQQ
— BIG TV Breaking News (@bigtvtelugu) May 11, 2025