BigTV English

India Pak Ceasefire: కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఎలా అంగీకరించింది.. ఇరు దేశాల మధ్య ఏం జరిగింది?

India Pak Ceasefire: కాల్పుల విరమణకు పాకిస్తాన్ ఎలా అంగీకరించింది.. ఇరు దేశాల మధ్య ఏం జరిగింది?

India Pak Ceasefire| నాలుగురోజుల పాటు దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య భీకరంగా మిసైల్ దాడులు, సైనిక పోరాటం కొనసాగిన తరువాత ఇరు వైపులూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. భూమి, ఆకాశం, సముద్ర మార్గాన జరిగే అన్ని దాడులు నిలిపివేసేందుకు మే 10 శనివారం సాయంత్రం నుంచి మిలిటరీ డైరెక్టర్ల స్థాయిలో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందాన్ని కొన్ని గంటల తరువాతే పాకిస్తాన్ ఉల్లంఘించిందనే ఆరోపణలూ వచ్చాయి. గుజరాత్, జమ్ము కశ్మీర్ లోని రాజధాని శ్రీనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు కనిపించగా ఇండియన్ ఆర్మీ, బిఎస్ఎఫ్ జవాన్లు వాటిని కూల్చి వేశాయి.


పాకిస్తాన్ కాల్పల విరమణ ఒప్పందం ఉల్లంఘించందని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ బహిరంగంగా ప్రకటించారు. ఈ ఉల్లంఘనకు పాకిస్తాన్ కు తగిన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.

అయితే భారతీయులందరిలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. ఈ ఒప్పందం వెనుక ఏం జరిగింది? పాకిస్తాన్, ఇండియా ఈ ఒప్పందానికి ఏ కారణాల చేత అంగీకరించాయో వాటిని భారత్ విదేశాంగ శాఖ, రక్షణ శాఖ వెల్లడించింది.


మే 10 శనివారం ఉదయం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్రహ్మోస్ ఏ క్రూయిజ్ మిసైల్స్‌ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై ప్రయోగించింది. ముందుగా పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలోని రావల్పిండి సమీపంలో ఉన్న చక్‌లాలా , సర్ గోధా ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై భారత్ బ్రహ్మోస్ మిసైల్స్ లో దాడి చేసింది. ఆ తరువాత పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని జకోబాబాద్, బోలారి, స్కర్‌దూ మిలిటరీ వైమానిక స్థావరాలపై భారత వాయు సైన్యం మధ్యాహ్నం దాడులు కొనసాగించింది. ఈ ఎయిర్ ఫోర్స్ స్థావరాలన్నీ పాకిస్తాన్ మిలిటీర ఆపరేషన్స్ కు చాలా కీలకం. ఈ స్థావరాలన్నీ దెబ్బతినడంతో పాకిస్తాన్ సగం బలం కోల్పోయింది.

ఈ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ మిలిటీర రహస్య సమాచారాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ ఎమర్జెన్సీ మెసేజింగ్ ద్వారా సేకరించింది. ఈ మెసేజ్ లలో పాకిస్తాన్ మిలిటరీ అధికారుల చర్చలు రికార్డ్ అయి ఉన్నాయి. భారత్ తదుపరి టార్గెట్ పాకిస్తాన్ లోని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ అని పాక్ అధికారులు ఆందోళన చెందినట్లు ఈ మెసేజ్‌లు ఇంటర్‌సెప్ట్ చేయడం ద్వారా తెలిసింది. అందుకే పాకిస్తాన్ మిలిటరీ.. రావల్పిండిలోని న్యూక్లియర్ ప్లోగ్రామ్ స్థావరాల వద్ద సెక్యూరిటీని విపరీతంగా పెంచేసింది.

ఇక ఇండియా దాడి చేస్తే తమ ఓటమి ఖాయమని భావించిన పాకిస్తాన్ వెంటనే అమెరికా సాయం కోసం ఫోన్లు చేసింది. అప్పటికే ఇండియా, పాకిస్తాన్ యుద్ధాన్ని మానటరింగ్ చేస్తున్న అమెరికా అధికారులు ఇరు వైపులా దౌత్య మార్గంలో సంప్రదించారు. పాకిస్తాన్ లోని న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సహా కీలక మిలిటరీ స్థావరాలకు నష్టం జరగకుండా కాపాడేందుకు అమెరికా అధికారులు పాకిస్తాన్ ని ముందుగా కాల్పుల విరమణకు వెంటనే అంగీకరించాలిన చెప్పాయి. ఆ తరువాత ఇండియన్ మిలిటరీకి కూడా పాకిస్తాన్ అంగీకరించింది కాబట్టి ఇక దాడులు చేయడం ఆపేయాల్సిందిగా సూచించారు.

Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన

ఇక నిర్ణయాలు తీసుకునేందుకు ఇరువైపులా మే 10, మధ్యాహ్నం 3.35 గంటలకు చర్చలు ప్రారంభమయ్యాయి. ముందుగా పాకిస్తాన్ డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డిజిఎంవో) మేజర్ జనరల్ కాషిఫ్ అబ్దుల్లా ఇండియా డిజిఎంవో లెఫ్టెనెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కు ఫోన్ చేశారు. ఈ చర్చల గురించి భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఈ చర్చల్లోనే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

అయితే భారత్ మాత్రం కాల్పుల విరమణకు అంగీకరించినా ఇతర దౌత్య చర్చలకు అంగీకరించలేదు. అంతర్జాతీయంగా భారత్ పై ఒత్తిగి వచ్చినా కేవలం సైనిక చర్యలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించింది. సింధూ నది జలాల నిలిపివేత, వీసాల రద్దు వంటి ఇతర ఆంక్షలు కొనసాగుతాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×