E-Paper
Advertisement

Bus Accident: అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

Bus Accident: అన్నమయ్య జిల్లాలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ప్రాణాపాయం
Advertisement

Bus Accident: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల యాత్ర ముగించుకొని శంషాబాద్‌కు తిరుగు ప్రయాణమైన భక్తుల మినీ బస్సు, సరిగ్గా సంబేపల్లి పోలీస్ స్టేషన్ ముందు అదుపు తప్పింది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో బస్సు ఒక్కసారిగా పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో రంగారెడ్డి జిల్లాకు చెందిన 16 మంది అయ్యప్ప భక్తులు ఉండటంతో అందరూ ఒక్కసారిగా హడలిపోయారు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనలో బస్సు డ్రైవర్ రాజుతో పాటు ఒక చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తక్షణమే స్పందించి క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మిగిలిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులంతా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ అలసట వల్ల లేదా నిద్రలోకి జారుకోవడం వలనో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Also Read: తెలంగాణలో భారీగా IAS అధికారుల బదిలీలు.. పూర్తి జాబితా ఇదే!

అయితే కిందటి పది రోజులుగా ఎంతో నిష్ఠతో స్వామిని దర్శించుకుని, “శరణం అయ్యప్ప” అంటూ ఇంటికి వస్తున్న వేళ ఈ ఆపద రావడం భక్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయ్యప్ప స్వామి దయ వల్లనే ఇందరి ప్రాణాలు గట్టెక్కాయని భక్తులు కన్నీళ్లతో చెప్పుకున్నారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన విషయం తెలియగానే శంషాబాద్‌లోని భక్తుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు, కానీ అందరూ క్షేమమని తెలియడంతో శాంతించారు. పోలీసులు క్రేన్ సాయంతో రోడ్డుకు అడ్డంగా పడ్డ బస్సును పక్కకు తొలగించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×