E-Paper
Advertisement

Hyderabad Crime: చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ.. నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు

Hyderabad Crime: చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ.. నెంబర్ ప్లేట్ టాంపరింగ్, షాకైన వాహనదారుడు
Advertisement

Hyderabad Crime: హెల్మెట్‌ ధరించాలని పదేపదే పోలీసులు చెబుతున్నారు. అయినా కొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పోలీసుల మాటలను పెడ చెవిన పెట్టారు. ఫలితంగా చలాన్లు వేస్తున్నారు. వాటి నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏకంగా బండి నెంబర్‌ని టాంపరింగ్ చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకా ఈ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

హైదరాబాద్ సిటీలో చలాన్లు తప్పించుకోవడానికి ఎత్తుగడ

Advertisement

హైదరాబాద్‌లో వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు పదే పదే చెబుతున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో సేఫ్‌గా బయటపడతారని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరు వాహనదారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మరికొందరు కొత్త ఆలోచనలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో మరొక వాహనం నెంబర్ ప్లేట్‌ని టాంపరింగ్ చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి.

నెంబర్ ప్లేట్ టాంపరింగ్ అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. మలక్‌పేటకు చెందిన సయ్యద్‌ అలీవుద్దీన్‌కు టూ వీలర్ ఉంది. దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ టీఎస్‌ 11 ఈజెడ్‌ 2936. అయితే ఈ-చలాన్లు తప్పించుకుపోవడానికి దాన్ని టీఎస్‌ 11 ఈజెడ్‌ 2836గా మార్చుకున్నాడు. సిగ్నల్ వేసినా వెళ్లడం, హెల్మెట్ లేకపోవడం వంటి ఉల్లంఘనలకు పాల్పడ్డాడు.

Advertisement

బండి నెంబర్ ప్లేట్ టాంపరింగ్, ఏకంగా 23 చలాన్లు, షాకైన వాహనదారుడు

దీనికి సంబంధించిన చలాన్లు టీఎస్‌ 11 ఈజెడ్‌ 2836 వాహనదారుడు ఫహీమ్‌ అలీకి వెళ్లాయి. ఒకటీ రెండు కాదు ఏకంగా 23 చలాన్లు అందుకున్నాడు. ఉన్నట్లుండి తాను ఆ సమయంలో ఇంట్లో ఉన్నానని, చలాన్లు ఎలా పడ్డాయని సిటీ ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అది చూసి షాకైన పోలీసులు, బాధ్యుడిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలో దిగి సీసీ కెమెరాలను పరిశీలించారు.

చివరకు అసలు నిందితుడు అలీవుద్దీన్‌ ఆచూకీ పసిగట్టారు. నిందితుడిపై చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేశాడు. వాడ్ని అదుపులోకి తీసుకున్నారు. నేరం నిర్ధారణ అయితే గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తమ వాహనం నెంబర్ ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఈ-మెయిల్‌, వాట్సాప్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని ట్రాఫిక్ అధికారులు సూచించారు.

ALSO READ: శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప‌మాదం.. ప్రైవేట్ బస్సు బోల్తా

echallan helpdesk.hyd@gmail.com, వాట్సాప్‌-87126 61690.  నకిలీ లేదా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం తీవ్రమైన నేరమని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. అలాంటి ఉల్లంఘనలను గుర్తించడానికి CCTV, ANPR కెమెరాల వంటి అధునాతన వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో పోలీసులకు చిక్కితే ఇక జైలుకే.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×