E-Paper
Advertisement

Crime News: దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి

Crime News: దారుణం.. కన్న బిడ్డలనే కడతేర్చిన కసాయి తండ్రి
Advertisement

Crime News: కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో దారుణం చోటుచేసుకుంది. మల్లేశం అనే 45 ఏళ్ల వ్యక్తి, మానసిక వైకల్యంతో బాధపడుతున్న తన సొంత కుమారుడు ఆశ్రిత్ (17), కూతురు అర్చన (15)లను గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది.

Advertisement

అయితే పిల్లల తల్లి పని మీద బయటకు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరు లేరు ఇదే మంచి సమయం అనుకొని మానసిక స్థితి బాలేని ఇద్దరి పిలల్ని చంపేందుకు ప్రయత్నించాడు. అంతలోనే తల్లి ఇంటికి వచ్చేసరికి మల్లేశం పరారయ్యాడు. అయితే తల్లి పిల్లలు ఇద్దరు అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసి తట్టుకోలేక పోయింది. వెంటనే చుట్టు పక్కల వాళ్లని పిలవగా వారు ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారు.

Also Read: జూబ్లీలో బంపర్ మెజారిటీ.. సీఎం రేవంత్ ఎత్తుగడలు, స్కెచ్‌లు..

Advertisement

పిల్లలని ఆసుపత్రిలో చికిత్స అందించారు. కానీ, చికిత్స పొందుతూ కూతురు అర్చన చనిపోయింది. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే పిల్లల మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మల్లేశం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం అని తెలిపారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×