E-Paper
Advertisement

Car Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, మద్యం మత్తులో యువకులు

Car Accident:  ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు, మద్యం మత్తులో యువకులు
Advertisement

Car Accident: హైదరాబాద్‌లో చదువుకుంటున్న ముగ్గురు యువకులు సంక్రాంతి పండుగ వేళ సొంతూరు జగిత్యాలకు వెళ్లారు. పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లో మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. అసలు ఘటన ఎలా జరిగింది?

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

జగిత్యాలకు చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. వారిలో నవనీత్, సాయితేజ, సృజన్ ఉన్నారు. సంక్రాంతి సెలవుల కోసం సొంతూరికి వచ్చారు ఈ యువకులు. శనివారం రాత్రి జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు కారులో తిరుగు ప్రయాణం అయ్యారు. పోరండ్ల వద్ద వీరంతా పార్టీ చేసుకుంది. అనంతరం అక్కడి నుంచి హైదరాాబాద్ కు బయలుదేరారు.

మద్య మత్తులో యవకులు అతివేగం కారణంగా కారు నడిపారు. అదుపు తప్పి కారు నేరుగా విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది. అనంతరం డివైడర్‌ను మోదేసింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలో మృత్యువాతపడ్డారు. మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement

విద్యుత్ స్థంభాన్ని ఢీ కొట్టిన కారు, ఇద్దరు మృతి

ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ రూట్లో వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాన్ని పక్కకు తొలగించిన పోలీసులు, ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో జగిత్యాలలోని ఆ యువకుల ఇంటి వద్ద తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు.

మరోవైపు నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్యాలమ్మ గూడెం ప్రాంతం వద్ద నేషనల్ హైవేపై ఒక కారు అదుపు తప్పింది. ఆ తర్వాత బలంగా చెట్టుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ కి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: ఇద్దరు ప్రియురాళ్లు, ఓ ప్రియుడు, ఎక్కడ చెడింది?

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×