E-Paper
Advertisement

Chennai Crime: ఇద్దరు ప్రియురాళ్లు-ఓప్రియుడు.. ఎక్కడ చెడింది? స్కెచ్ వేసి ఆపై లేపేశారు

Chennai Crime: ఇద్దరు ప్రియురాళ్లు-ఓప్రియుడు.. ఎక్కడ చెడింది? స్కెచ్ వేసి ఆపై లేపేశారు
Advertisement

Chennai Crime: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా చంపుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు, కోరుకున్న ప్రియుడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

తమిళనాడులో దారుణం..  ప్రియుడ్ని లేపేసిన ప్రియురాళ్లు

Advertisement

ప్రేమ విఫలమైందనే కారణంతో ఇద్దరు మహిళలు తమ ప్రియుడ్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో మైనర్ సహా ముగ్గురు అరెస్టు అయ్యారు. విచారణ తర్వాత మహిళలను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. మైనర్ బాలుడ్ని జువైనల్ హోమ్‌కి తరలించారు. ఈ కేసులో మైనర్ బాలుడు ఎలా వచ్చాడు?

తమిళనాడులోని పల్లవరం ప్రాంతానికి చెందిన ఆరుముగం కొడుకు సెల్వకుమార్‌. అతడి వయస్సు 22 ఏళ్లు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సెల్వకుమార్‌‌కి పాత పల్లవరంలోని పచ్చై యమ్మన్‌ కోవిల్‌ వీధికి చెందిన రీనా, ఆమె స్నేహితురాలు రజితలతో పరిచయం ఏర్పడింది.  ఇద్దరు మహిళలకు వివాహం జరిగింది. అనుకోకుండా సెల్వకుమార్‌తో పరిచయం కాస్త పెరిగింది.

Advertisement

ప్రియుడి టార్చర్ తట్టుకోలేక ప్లాన్ ప్రకారం స్కెచ్

ఆ తర్వాత ఈ ముగ్గురు దగ్గరయ్యారు. చివరకు అది అక్రమ సంబంధంగా మారింది. సెల్వకుమార్‌ తరచుగా రీనా-రజితతో గొడవకు దిగేవాడు. ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించేవాడు. జనవరి 14న రాత్రి 10 గంటల ప్రాంతంలో సెల్వకుమార్‌.. రీనా-రజితలతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అనుమానాస్పద వ్యక్తులు అక్కడికి వచ్చి సెల్వకుమార్‌‌ని చుట్టు ముట్టి కత్తులతో దాడులకు పాల్పడ్డారు.

ఘటన తర్వాత అక్కడి నుంచి వారంతా పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సెల్వకుమార్‌ని ఘటనా స్థలం నుంచి తాంబరం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చెన్నైకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సెల్వ కుమార్‌ మరణించాడు. దీంతో పల్లవరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు.

వివాహేతర సంబంధం కారణంగా సెల్వకుమార్‌ హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీని ఆధారంగా మరింత లోతుల్లోకి వెళ్లారు పోలీసులు. రీనా, రజితను విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్వ కుమార్‌ తరచుగా తాగి వచ్చినప్పుడు గొడవలకు దిగేవాడని, ఈ టార్చర్ తట్టుకోలేక పక్కాగా స్కెచ్ వేసి కొందరు వ్యక్తులతో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిపారు.

ALSO READ:  గడ్డకట్టిన సరస్సుపై నడక..  ఇద్దరు మృతి, కెమెరాకు చిక్కిన  ఘటన

బుధవారం రాత్రి ఓల్డ్ పల్లవరంలోని శుభం నగర్‌కు రావాలని సెల్వకుమార్‌కు ఫోన్ చేసింది రీనా. ఆ తర్వాత రజిత కూడా వచ్చింది. ముగ్గురు మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తప్పించుకోవడానికి ప్రయత్నించగా, ఆ ముఠా అతడ్ని వెంబడించి నరికి అక్కడి నుండి పారిపోయిందని పోలీసులు తెలిపారు.

రీనా-రజిత ఇద్దరూ ఈ ఘటనను దోపిడీగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. దారిన వెళ్ళేవారిని అప్రమత్తం చేశారు. విచారణ తర్వాత హత్యలో మహిళల పాత్ర బయటపడింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతరులను కనుగొనడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×