BigTV English

Lovers Suicide: కామారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

Lovers Suicide: కామారెడ్డిలో ప్రేమజంట ఆత్మహత్య.. ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

Lovers Suicide: టీనేజ్, యంగ్ ఏజ్ లో యువతీ, యువకులు ప్రేమ మైకంలో ఉంటారు. కొందరికి ఆ ప్రేమ జీవితాన్నిస్తే.. మరికొందరిపాలిట శాపంగా మారుతుంది. ప్రేమికుల తల్లిదండ్రుల మధ్య ఇప్పటికీ కూడా కులాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి కులం, ఇతర మతస్తులను ప్రేమిస్తే ససేమిరా ఒప్పుకోవట్లేదు. తమని కాదని పెళ్లిచేసుకుంటే పరువు హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొందరు ప్రేమికులు తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది.


దోమకొండ మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన సాయికుమార్ (24), అంబర్పేటకు చెందిన వీణ (22) డిగ్రీ చదువుతున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ విషయం ఇంట్లో పెద్దలకు చెప్పి పెళ్లి చేయాలని అడుగగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేం అనుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సాయికుమార్, వీణ ల ఆత్మహత్యలతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి.. ఇరువురి మృతదేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Also Read: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య


ఔటర్ రింగురోడ్డుపై ప్రమాదం

పెద్ద అంబర్ పేట్ ఎగ్జిట్ నంబర్ 10 వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ నుంచి ఈసీఐఎల్ కు కారులో వెళ్తుండగా.. ఎగ్జిట్ నంబర్ 10 వద్ద కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

మేడ్చల్ లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఉదయం 7 గంటల సమయంలో.. మేడ్చల్ టౌన్ బస్ డిపో నుంచి రోడ్డు దాటుతున్న మహిళను లారీ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలిని రాగజ్యోతి (32)గా గుర్తించి.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

 

 

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×