Deadbody In Suitcase| దేశంలో నేరాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలపై అత్యాచారం, హత్య ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. కోల్ కతా లో కొంతకాలం క్రితం ఓ మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి.. ఆమెను రాక్షసంగా హత్య చేసిన ఘటన దేశమంతా దుమారం రేపింది. మరోవైపు తాజాగా తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో ఒక మహిళ శవం సూట్ కేసులో లభించింది. అయితే ఆ సూట్ కేసుని హంతకులు నడిరోడ్డుపైనే పడేసి వెళ్లిపోవడం చాలా సీరియస్ అంశం.
పోలీసుల కథనం ప్రకారం. చెన్నైలోని తొరైపాక్కమ్ ప్రాంతంలో గురువారం సెప్టెంబర్ 19, 2024న స్థానికులకు ఓఎంఆర్ రోడ్డు పరిసరాల్లో ఏదో దుర్వాసన రావడంతో వారు పరిశీలించగా.. అక్కడ రోడ్డు పక్కనే ఒక పెద్ద సూట్ కేసు కనిపించింది. ఆ సూట్ కేసులో నుంచే విపరీతమైన దుర్వాసన వస్తోందని గమనించిన స్థానికులు ఉదయం 9.30 గంటలకు పోలీసులకు ఫోన్ చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తొరైపాక్కమ్ చేరుకొని సూట్ కేస్ తెరిచి చూడగా.. అందులో రక్తసిక్తమైన మహిళ శవం కనిపించింది. ఆ మహిళను ఎవరో హత్య చేసి.. శవాన్ని ముక్కలుగా నరికి ఆ సూట్ కేసులో పెట్టినట్లు పోలీసులు గమనించారు.
Also Read: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..
అయితే ఆ సూట్ కేసులో యువతి ఐడి కార్డు లభించడంతో ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలికి చెందిన దీపా అనే యువతి అని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శవాన్ని పోలీసులు పోస్టు మార్టం కోసం తరలించి.. విచారణ చేపట్టారు. అయితే హంతకులు శవాన్ని నిర్భయంగా రోడ్డు పైనా పడేసి వెళ్లిపోవడం గమనార్హం.
ఇలాంటిదే మరోకేసుల ఇటీవలే స్విట్జర్‌ల్యాండ్ దేశంలో జరిగింది. అక్కడ మిస్ స్విట్జర్‌ల్యాండ్ అందాల పోటీల్లో ఫైనలిస్ట్ అయిన కాటరీనా అనే 36 ఏళ్ల యువతిని ఆమె భర్త హత్య చేసి.. ఆ తరువాత ముక్కలుగా నరికి, ఆ ముక్కలను మిక్సీలో వేసి జ్యూస్ కొట్టాడు. ఆ తరువాత శవం మిగిలిన భాగంపై యాసిడ్ పోశాడు. ఇదంతా ఎవరూ తన భార్య శవం అని గుర్తుపట్టకుండా చేశాడు. ఆ తరువాత శవాన్ని ఊరి చివర చెరువు వద్ద పడేశాడు.
Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట, రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ
కానీ కాటరీనా తల్లిదండ్రులు పోలీసులకు తమ కూతురు కనబడడం లేదని మిస్సింగ్ కేసు నమోదు చేయగా.. ఊరి చివర గుర్తుతెలియని శవం లభించింది. దీంతో పోలీసులు ఆ శవానికి కాటరీనా తల్లిదండ్రుల డీఎన్‌ఏ పోల్చి పరీక్ష చేశారు. ఆ పరీక్షలో ఆ శవం కాటరీనాదే అని తేలిపోవడంతో పోలీసులు కాటరీనా భర్తను అరెస్టు చేసి తమ పద్ధతిలో ప్రశ్నించారు. అప్పుడు కాటరీనా భర్త థామస్.. ప్లేటు ఫిరాయించాడు. కాటరీనా తనపై దాడి చేసేందకు వస్తే.. ఆత్మరక్షణలో ఆమెను చంపాల్సి వచ్చిందని చెప్పాడు. కానీ కోర్టు మాత్రం అతడు హత్య చేసిన విధానం తెలుసుకొని దోషిగా తేల్చింది.