BigTV English

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Actress Pragathi : సీనియర్ నటి ప్రగతి (Pragathi ) కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా సమయంలో షూటింగ్ లేకపోవడం వల్ల నిత్యం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరిచింది. హెవీ వర్కౌట్లు చేస్తూ అందులో అవార్డులు కూడా అందుకుంది. ఇక ఈమె వర్కౌట్స్ చూసి యువత కూడా ఆశ్చర్యపోయారు. అలాగే డాన్స్ వీడియోలను కూడా షేర్ చేస్తూ ఈ వయసులో కూడా ఇంత ఎనర్జిటిక్ లెవెల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ అభిమానులు సైతం ప్రశ్నల వర్షం కురిపించారు.


ఫన్నీ రీల్స్ తో నవ్వుల పాలవుతున్న ప్రగతి..

ఇదిలా ఉండగా ఇటీవల ఫన్నీ రీల్ వీడియోలు కూడా చేస్తోంది. బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న ఈమె అప్పుడప్పుడు సినిమాలలో కూడా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఇకపోతే ప్రగతిని ఒకప్పుడు యాక్సెప్ట్ చేసినట్టుగా ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం లేదని చెప్పవచ్చు. గత నెలలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో ప్రగతి వేసిన పాత్రకు విపరీతమైన నెగిటివిటీ వచ్చిన విషయం తెలిసిందే. ప్రగతి నటించిన తీరు,, కనిపించిన వైనం చూసి అందరూ ట్రోల్ చేస్తూ నవ్వుకున్నారు. ఇలాంటి వీక్ క్యారెక్టర్స్ ను పూరి ఎందుకు తీసుకున్నార్రా బాబూ అంటూ కామెంట్లు చేశారు.


స్కామ్ అలర్ట్ చేసిన ప్రగతి..

Actress Pragathi: Alerted Pragati.. complains that it is not her number..!..
Actress Pragathi: Alerted Pragati.. complains that it is not her number..!..

ఇదిలా ఉండగా మరొకవైపు ప్రగతి తన నంబర్ అంటూ జరుగుతున్న స్కామ్ గురించి అందరిని అలర్ట్ చేసింది. తన పేరు మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చాటింగ్ చేస్తున్నారని.. అది తన నెంబర్ కాదని, ఎవరికైనా తన పేరు మీదుగా మెసేజ్లు వస్తే మాత్రం రెస్పాండ్ కావద్దంటూ సూచించింది. మొత్తానికి అయితే ఎవరో తన నంబర్ అంటూ స్కామ్ కి గురిచేస్తున్నారంటూ హెచ్చరించింది. మొత్తానికైతే ముందుగానే తన ఫాలోవర్స్ ను అలర్ట్ చేసి జాగ్రత్త పడింది ప్రగతి. ఇక ప్రస్తుతం ఈమె వేసిన పోస్టును నందిని రెడ్డి సైతం షేర్ చేయడం గమనార్హం. అంతేకాదు ఈ నెంబర్ గురించి సైబర్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపింది. ఎవరైనా సరే తమకు ఈ నెంబర్ నుంచి ఫోన్లు కానీ మెసేజ్లు కానీ వస్తే స్పందించకండి అంటూ కోరింది.

స్పందించిన నందిని రెడ్డి..

ప్రస్తుతం నందిని రెడ్డి కూడా తన ఇన్ స్టా స్టోరీలో ప్రగతి వేసిన పోస్టును స్టేటస్ గా పెట్టుకుంది. మొత్తానికైతే సెలబ్రిటీలకు ఇలాంటి స్కామ్ లు తలపోటుగా మారుతున్నాయి. హ్యాక్ లు, ఇలాంటి స్కామ్ ల గురించి నిత్యం ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తూ అందరిని అలర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అందరూ జాగ్రత్తగా ఉండాలని స్కామర్స్ బారిన పడకుండా జాగ్రత్త వహించాలంటూ సెలబ్రిటీలు కోరుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రగతి చేసిన ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ నెంబర్ తో ఎవరు స్కామ్ కి పాల్పడ్డారో పట్టుకొని వారికి కఠిన శిక్షలు విధించాలంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×