BigTV English
Advertisement

Macharla Crime: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

Macharla Crime: మాచర్లలో దారుణం.. మూడేళ్ల చిన్నారిపై తండ్రి ఘాతుకం

Father Raped his Five Years Old Daughter: ఆడపిల్లలకు రక్షణగా నిలవాల్సిన తండ్రి, సోదరులే.. కామంతో కళ్లు మూసుకుపోయి వారిపాలిట శాపంగా మారుతున్నారు. ఆడపిల్లలకు తండ్రే అన్నీ తానై ఉంటాడని, మగపిల్లలకు తల్లి అంటే చాలా ఇష్టమన్నది మన పెద్దల కాలం నుంచి అందరూ చెప్పుకునే మాట. ఇంటి పక్కన ఉన్నవారు కాదు కదా.. సొంతింటిలోనే రక్షణ లేకుండా పోయింది. ఇంటిలో తల్లిలేకపోతే.. నాన్న ఉన్నాడులే అన్న ధైర్యంతో ఆడపిల్లలు ఉండే పరిస్థితి లేకుండా పోతోంది.


అశ్లీలత్వం ఎక్కైవయ్యో.. చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసో.. కారణం ఏదైనా కానీ.. తమలో ఉన్న కామ క్రూరుడిని నిద్రలేపి.. పసికందుల జీవితాలను చిదిమేస్తున్న తండ్రులెందరో ఉన్నారు. తాజాగా మాచర్ల పట్టణంలో ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు ఆ క్రూరమృగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్లలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవించే వ్యక్తికి.. ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. భర్త రెండేళ్ల క్రితం.. మూడేళ్ల వయసున్న తన పెద్దకుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని గమనించిన తల్లి.. అతడిని ఛీదరించుకుని ఇద్దరు కూతుర్లను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. 2 నెలల క్రితం.. తాను పూర్తిగా మారిపోయానని, భార్య పిల్లల్ని మంచిగా చూసుకుంటానని పెద్దల సమక్షంలో నమ్మించి కాపురానికి తీసుకెళ్లాడు.


Also Read: కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లై డిటెక్టర్.. ఏం తెలిసిందంటే?..

భర్త మారాడని నమ్మిన ఆమె.. అతని ప్రవర్తనను పసిగట్టలేకపోయింది. రాత్రిపూట తాగి ఇంటికొచ్చి.. భార్య, పిల్లలకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి.. నిద్రపుచ్చుతున్నాడు. ఆ సమయంలోనే పెద్దకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కానీ.. తమకు కావలిసినవన్నీ ఇస్తూ.. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని భార్య అనుకుంది. రోజూ రాత్రి జరిగేది ఇదే తంతు. మూత్ర విసర్జన సమయంలో.. అమ్మా నొప్పిగా ఉందని ఐదేళ్ల కూతురు ఏడవడంతో.. ఏమైందోనని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చిన్నారికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు నిర్ఘాంతపోయే విషయం చెప్పారు.

వైద్యులు చిన్నారిపై అత్యాచారం జరిగిందని చెప్పడంతో.. వెంటనే పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఆ తల్లి. ఈ కిరాతకుడిని కఠినంగా శిక్షించండి అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సీఐ ప్రభాకరరావు.. డీఎస్పీకి నివేదిక పంపారు.

Related News

Chittoor Leopard Attack: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు

Ahmedabad Crime: దృశ్యం మూవీ తరహాలో.. భర్తని చంపి వంట గదిలో పూడ్చింది, ఆ తర్వాత..

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Big Stories

×