E-Paper
Advertisement

జోగిపేటలో చడ్డీ గ్యాంగ్ హల్చల్.. బస్సుల్లో డిజిల్ చోరీ!

జోగిపేటలో చడ్డీ గ్యాంగ్ హల్చల్.. బస్సుల్లో డిజిల్ చోరీ!
Advertisement

Diesel Theft: స్వేచ్చ బ్యూరో: జోగిపేట పట్టణంలో సోమవారం అర్దరాత్రి 2 గంటల ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ డీజిల్‌ దొంగతనాలకు పాల్పడింది. పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల ఆవరణలోని సీసీ పుటేజీలో రికార్డు అయ్యింది. అంబేద్కర్‌ విగ్రహం వైపు నుంచి వచ్చిన నలుపు రంగు కారు ముందుకు వెళ్లి వెనక్కి మలుపుకొని వచ్చి ఆక్స్‌ఫర్డ్‌ పాఠశాల గోడకు దగ్గరగా నిలుపుకున్నారు. అందులో నుంచి ముగ్గురు యువకులు బయటకు దిగారు. వారంతా చడ్డీలు ధరించి ఉన్నారు. పాఠశాలలోని ప్రహరిగోడను దూకి పాఠశాలకు చెందిన బస్సుల్లో నుంచి సుమారుగా 50 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు.

Also Read: బాధితురాలికి న్యాయం జరగాల్సిందే.. బండి సంజయ్ కుమారుడి కేసుపై మంత్రి పొన్నం స్పష్టం!

డిజిల్ దొంగతనం..

Advertisement

అదే రోజున లారీలో నుంచి 100 లీటర్ల వరకు గుర్తు తెలియని దొంగలు డీజిల్‌ను దొంగిలించారు. పాఠశాల వాహనాల్లో నుంచి డీజిల్‌ దొంగతనంపై పాఠశాల యాజమాన్యం మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కారుకు ఉన్న నంబరును పరిశీలించగా అది ఒక ఆటోదిగా గుర్తించారు. ఈ విషయమై పోలీసులు నిందితుల కోసం అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు చడ్డీలపై వచ్చే దొంగలు ఇళ్ళల్లో దొంగతనాలు చేయడమే విన్నాం. కానీ వాహనాల్లో నుంచి డీజిల్‌ దొంగతనాలకు సైతం ఎగబడ్డారని తెలుస్తుంది.

Also read: గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్‌లో తొలగింపుపై ఉత్కంఠ!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×