E-Paper
Advertisement

పిచ్చెక్కించే ప్రేమ మాయ…. మనసును హత్తుకునే సరికొత్త టీన్ డ్రామా

పిచ్చెక్కించే ప్రేమ మాయ…. మనసును హత్తుకునే సరికొత్త టీన్ డ్రామా
Advertisement

Feel Good Love Story on OTT : ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా, అది ఇచ్చే ఫీల్ మాత్రం మాటల్లో చెప్పలేం. ఇందులో ఉండే ఎమోషన్ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సినిమాలలో ఇలాంటి స్టోరీలు వస్తున్నా కొన్ని మాత్రమే మనసును టచ్ చేస్తాయి. అలాంటి ఒక మరచిపోలేని కంటెంట్ వెబ్ సిరీస్ రూపంలో స్ట్రీమింగ్ లో ఉంది. ఇది ఒక ప్రేమికుడికి తగిలిన గట్టి దెబ్బ లాంటి ఎమోషనల్ స్టోరీ. ఇది మనల్ని నవ్విస్తూనే గుండెల్ని పిండేసే ఒక పిచ్చెక్కించే ప్రేమ కథ. ఈ మిని సిరీస్ పేరు ‘లూకింగ్ ఫర్ అలాస్కా'(Looking for Alaska). ఓటీటీలో దీనికి ఎనిమిదికి పైగా రేటింగ్ కూడా ఉంది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ టీన్ డ్రామా 2019 అక్టోబర్ 18న హులు (Hulu) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ప్రముఖ రచయిత జాన్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా ఇది రూపొందింది. ఇందులో చార్లీ ప్లమ్మర్ (మైల్స్ పాత్రలో), క్రిస్టీన్ ఫ్రోసెత్ (అలాస్కా పాత్రలో) ప్రధాన పాత్రలు పోషించారు. సిరీస్ వెనుక దాదాపు 13 ఏళ్ల నిరీక్షణ ఉంది. రచయిత జాన్ గ్రీన్ ఈ నవలను 2005లోనే రాసినప్పటికీ, దీనిని వెండితెరపైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాగా తీయాలని ప్లాన్ చేసినా, చివరికి 8 ఎపిసోడ్ల మినిసిరీస్‌గా రూపొందించారు. ఈ సిరీస్‌లో 2000వ సంవత్సరం నాటి వాతావరణాన్ని గుర్తుచేసేలా అప్పట్లో ఫేమస్ అయిన ఇండీ రాక్ పాటలను ఇందులో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా వాడారు. ఇది చూసేవారికి ఒక వింటేజ్ ఫీల్‌ని ఇస్తుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ను జియో హాట్‌స్టార్ కూడా చూడచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మైల్స్ హాల్టర్ అనే కుర్రాడు తన రొటీన్ లైఫ్ బోర్ కొట్టి, ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూడాలని అనుకుంటాడు. అదే సమయంలో అతను ఒక బోర్డింగ్ స్కూల్‌లో జాయిన్ అవుతాడు. అనుకున్నట్టే అక్కడ అతనికి మంచి స్నేహితులు పరిచయమవుతారు. అయితే అందరికంటే ముఖ్యంగా అలాస్కా యంగ్ అనే అమ్మాయి మైల్స్ జీవితంలోకి వస్తుంది. ఆమె చాలా అందంగా కూడా ఉంటుంది. మైల్స్ ఆమె వైఖరికి, వ్యక్తిత్వానికి ఫిదా అయిపోయి ప్రేమలో పడతాడు. వీళ్ళంతా కలిసి హాస్టల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ, అల్లరి పనులు చేస్తూ సరదాగా గడుపుతుంటారు. కానీ ఒక రాత్రి అలాస్కా చాలా ఎమోషనల్ అయ్యి, గట్టిగా ఏడుస్తూ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని తెలిసి అందరూ షాక్ అవుతారు. అసలు ఆ రాత్రి ఆమె ఎందుకు అంతలా ఏడ్చింది? ఎక్కడికి వెళ్ళింది? అది ప్రమాదమా లేక ఆమె కావాలనే అలా చేసుకుందా? అనే ప్రశ్నలు మైల్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరికి ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ? మైల్స్ అంతలా ఎందుకు ఎమోషనల్ అయ్యాడు ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దేవుడికి పూజలు చేస్తుంటే మధ్యలో దెయ్యం గోల ఒకటి… బాబోయ్ ప్యాంటు తడిపించే సీన్లు

Related News

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Big Stories

Advertisement
×