E-Paper
Advertisement

Watermelon: పుచ్చకాయతో డేంజర్.. వాటిని తిని ఓ బాలుడు మృతి? మరో నలుగురికి ఇప్పుడిప్పుడే

Watermelon: పుచ్చకాయతో డేంజర్.. వాటిని తిని ఓ బాలుడు మృతి? మరో నలుగురికి ఇప్పుడిప్పుడే
Advertisement

Watermelon: దేశంలో పుచ్చకాయల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఊహించని ఘటన జరిగింది. వివాహ వేడుకలో విందు తిన్న తర్వాత, వాటర్ మిలాన్ తీసుకున్నాడు ఓ బాలుడు. కొద్దిసేపటి తర్వాత బాలుడు మృతి చెందగా మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అసలేం జరుగుతోంది?

ఛత్తీస్‌ఘడ్ ఊహించని ఘటన.. పుచ్చకాయ తిని బాలుడి మృతి

Advertisement

ఛత్తీస్‌గఢ్‌లోని ఒక గ్రామంలో పెళ్లి విందు తర్వాత ఇంట్లో ఉంచిన పుచ్చకాయను ఐదుగురు చిన్నారులు తిన్నారు. అది తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలో ఐదుగురు పిల్లలు అకస్మాత్తుగా కుప్పకూలారు. దీంతో వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. చివరకు ఓ బాలుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. బాలుడు మృతి చెందడంతో పెళ్లి వేడుక విషాదంగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లాలో ఒక వివాహ వేడుక పర్యటన విషాదంగా మారింది. పుచ్చకాయ తిన్న తర్వాత ఐదుగురు పిల్లలు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ బాలుడు మరణించగా, మరో నలుగురు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. సోమవారం మధ్యాహ్నం ఘుర్‌కోట్ గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది.

Advertisement

మరో నలుగురుకి అస్వస్థత.. ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ కొనసాగింపు

విందు భోజనం చేసిన తర్వాత ఇంట్లో ఉంచిన పుచ్చకాయ తిన్నారు ఐదుగురు చిన్నారులు. కొన్ని గంటలకే వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డారు. చివరకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడటంతో పెళ్లి విందు వేడుకలో గందరగోళం నెలకొంది. కుటుంబ సభ్యులు చిన్నారులను ఆసుపత్రికి తీసుకువెళ్లే సరికి ఓ బాలుడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఓ బాలుడు మరణించినట్టు అధికారులు చెప్పారు. పుచ్చకాయ తినడం వల్లే ఇలా జరిగిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఈ విషయాలు వివరించారు.  సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అందరు భోజనాలు చేశామని, ఆ తర్వాత రెండు గంటలకు చిన్నారులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని చెప్పారు.

ALSO READ: మెదక్ ఆదర్ష బ్యాంక్‌లో నయా మొసం.. నకిలీ బంగారంతో రూ.1.79 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అఖిలేశ్ ధివార్ అనే బాలుడు మృతి చెందగా, మరో నలుగురు బాలురులు కోలుకుంటున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న ఆరోగ్యశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు.

పెళ్లి విందు ప్రాంతానికి వెళ్లి ఆహార నమూనాలను, పుచ్చకాయ ముక్కలను సేకరించారు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఫుడ్ పాయిజనింగ్ వల్లే బాలుడు మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఘటనకు పుచ్చకాయ కారణమా అనేదానిపై అధికారుల దర్యాప్తులో తేలనుంది.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×