Child Slap Death| మృత్యువు ఎవరికి ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. కొందరు ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కోలుకుంటారు. కానీ కొందరు చిన్న ఘటనకే ప్రాణాలు వదిలేస్తారు. తాజాగా ఒక మూడేళ్ల పాపకు చెంపదెబ్బ కొట్టడంతో ఆమె చనిపోయింది. అయితే పోలీసుల భయంతో హంతకుడు ఆమె శవాన్ని ఊరి చివర పొదల్లో పడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలో థానె జిల్లా ఉల్హాస్‌నగర్ ప్రాంతంలో నవంబర్ 18న ఒక మూడేళ్ల పాప శవం లభించింది. ఆ శవం సగం కాలపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే ఆ ప్రాంతంలోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు రోజుల క్రితం పాప కనిపించడం లేదని ఒక మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో థానెలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో నివసించే పాప తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు.
ఈ కేసులో పోలీసులు పాప తల్లిదండ్రులను విచారణ చేయగా.. పాప చివరిసారిగా ఇంటి వద్దే ఆడుకునేదని.. పాపతో అమె మేనమామ కూడా ఉన్నాడని తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని చెప్పారు. దీంతో పోలీసులు పాప మేనమామను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ముందు తనకేమీ తెలియదని బుకాయించిన పాప మేనమామ ఆ తరువాత ఒక అనూహ్య ఘటన గురించి చెప్పాడు.
Also Read: విమాన ప్రయాణంలో ప్రైవేట్ పార్ట్స్ కాలిపోయాయి.. ఎయిర్‌లైన్స్‌పై కేసు పెట్టిన ప్రయాణికుడు!
ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాను పాపతో ఆడుకుంటూ ఉండగా.. ఆమెను చెంపదెబ్బ కొట్టానని.. అయితే ఆ దెబ్బకు పాప తల గోడకు తగిలిందని వివరించాడు. అప్పుడే తీవ్ర రక్తస్రావమై పాప మరణించిందని. అది చూసి తాను భయపడిపోయి.. పాప శవాన్ని ఊరి చివరకు తీసుకెళ్లి.. సగం కాల్చి ఆ తరువాత పడేశానని చెప్పాడు. ఈ కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు చేపడతామని థానె డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ గోరె తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా నిందితుడు తెలిపాడు. హత్యకు మరేకారణం తెలియడం లేదు. చిన్నారిపై ఏదైనా అత్యాచారం లాంటి ఘటన జరిగి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుందని అన్నారు.
మొబైల్ ఫోన్ మోజులో ప్రాణాలు కోల్పోయిన టీనేజర్
మొబైల్ ఫోన్ లేనిదే ఈ కాలంలో ఎవరూ ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. తాజాగా ఒక 17 ఏళ్ల అబ్బాయి మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని చెప్పిన స్కూల్ యజమాన్యంతో గొడవపడ్డాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖర్గోన్ జిల్లాలోని రాజ్ అసోరి అనే 17 విద్యార్థి మండలేశ్వర్ స్కూల్ లో 12వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ హాస్టల్‌లోనే ఉంటూ చదువుకోకుండా ప్రతిరోజు సెల్ఫీ, వీడియోలు తీసుకునేవాడు. తరగతి గదులకు వెళ్లకుండా వీడియోలు చూసుకుంటూ ఉండేవాడు. దీంతో హాస్టల్, స్కూల్ లో ఎవరి వద్ద మొబైల్ ఫోన్ ఉండకూడదని స్కూల్ యజమాన్యం నిబంధనలు పెట్టింది. ఈ క్రమంలో హాస్టల్ వార్డెన్ రాజ్ అసోరి వద్ద నుంచి మొబైల్ ఫోన్ తీసుకున్నాడు. దీంతో రాజ్ అసోరి, వార్డెన్ మధ్య గొడవ జరిగింది. విషయం ప్రిన్సిపాల్ వరకు వెళ్లింది. ప్రిన్సిపాల్ అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు లేని రాజ్ అసోరిని అతని మేనమామ పోషిస్తున్నాడు. విషయం తన మేనమామకు తెలిస్తే.. ఆయన కోపడతాడనే భయంతో రాజ్ అసోరి స్కూల్ నుంచి పారిపోయాడు.
అతడికోసం హాస్టల్ వార్డెన్, రాజ్ మేనమామ వెతుకుతూ ఉండగా.. రాజ్ అసోరి ఆ ప్రాంతంలోనొ కొండప్రాంతమైన ఒక పర్యటక ప్రదేశంలో కనిపించాడు. దీంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. మేనమామ చేతికి చెక్కితే చితకబాదుతాడనే భయంతో రాజ్ కొండపై నుంచి దూకి లోయలో పడ్డాడు. తీవ్ర గాయాలతో ఉన్న రాజ్ అసోరి ఆస్పత్రికి తీసుకెళ్లగా అతను చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించారు.