E-Paper
Advertisement

Alluri District News: ఫోన్ చూడొద్దన్న భర్త.. గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భార్య

Alluri District News: ఫోన్ చూడొద్దన్న భర్త.. గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన భార్య
Advertisement

Alluri District News: అసలే టెక్ యుగం.. గాడ్జెట్స్‌తో మనుషులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఒక్క క్షణం లేకుంటే ఉండలేని పరిస్థితి. ఎవరో ఒకరు ఫోన్ చేయడం, లేకుంటే రీల్స్ చేయడం అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. దీనికారణంగా దంపతుల మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా చంపుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఘటన ఒకటి అల్లూరి జిల్లాలో వెలుగుచూసింది.

దంపతుల మధ్య సెల్‌ఫోన్ చిచ్చు

Advertisement

ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో భాగమైంది సెల్‌ఫోన్. అది ఒక్క క్షణం లేకుండా యువతీ యువకులు గడపలేని పరిస్థితి. చేతిలో ఫోన్ లేకుంటే ఏదో పోయినట్టు ఫీలవుతున్నారు. దంపతుల గురించి చెప్పనక్కర్లేదు. దీని విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. చాలామంది దూరమవుతున్నారు కూడా.

Advertisement

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అది. చింతపల్లి మండలం మేడూరు గ్రామంలో ఊహించని ఘటన జరగింది. ఆ ప్రాతంలో రామారావు దంపతులు ఉంటున్నారు. ఆ తర్వాత ఆ దంపతుల జీవితాల్లోకి సెల్‌ఫోన్ ఎంటరైంది. బంధువులు ఫోన్ చేయడం, లేకుంటే వీలు చిక్కినప్పుడల్లా ఫోటోలు చూడడం, లేకుంటే రీల్స్ చేయడం కామన్‌గా మారిపోయింది.

మందలించినట్టు భర్తను గొడ్డలితో నరికిన భార్య

ఇదే వారి మధ్య గొడవలకు కారణమైంది. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవి. సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని భార్యపై ఆగ్రహించాడు భర్త. ఇంట్లో ఉండి ఫోన్ ఉపయోగిస్తే ఎలా అలా సీరియస్ అవుతున్నారని భావించింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది.

పట్టరాని కోపంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తపై పలుమార్లు దాడి చేసింది. తీవ్రంగా గాయపడ్డాడు, స్పాట్‌లో పడిపోయాడు భర్త రామారావు. ఆయన అరుపులు విన్న ఇరుగు పొరుగు వారు అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే చింతపల్లి నుంచి విశాఖ కేజీహెచ్‌కి రామారావుని తరలించారు.

ALSO READ: మీర్ పేట్‌లో ఘోరం.. పల్టీలు కొట్టిన కారు, స్పాట్‌లో ఐదుగురు

క్షతగాత్రుడు చికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించాడు. కట్టుకున్న భర్త తన కళ్ల ముందు మృతి చెందడాన్ని నిందితురాలు తట్టుకోలేకపోయింది. ఎంత పని చేశానంటూ కన్నీరుమున్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చింతపల్లి పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×