Couple Suicide: చిన్న చిన్న సమస్యలు ఫ్యామిలీలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భార్యభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చివరకు లోకం తెలియని చిన్నారులు అనాథలవుతున్నాయి. తాజాగా సిద్ధిపేట్ జిల్లాలో అలాంటి ఘటన ఒకటి జరిగింది. కాకపోతే ఇప్పుడు నలుగురు పిల్లల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
భార్యభర్తల మధ్య కలహాలు, ఆపై సమస్యలు
సిద్ధిపేట్ జిల్లాలో తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన 40 ఏళ్ల నాగరాజుకు పదేళ్ల కిందట రేణుకతో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతవరకు కథ బాగానే నడిచింది. ఏం జరిగిందో తెలీదు. ఆరేళ్ల కిందట కుటుంబ కలహాలతో నాగరాజు భార్య ఆత్మహత్య చేసుకుంది.
సెకండ్ మ్యారేజ్
ఆ ఇద్దరి పిల్లల కోసం ఆయన రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. 35 ఏళ్ల భాగ్యలక్ష్మితో నాగరాజుకు మరో వివాహం జరిగింది. వీరికీ మరోఇద్దరు పిల్లలు. ఒకరు లక్కీ, మరొకరు శ్రావణ్. భార్యభర్తలకు తోడు మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడనిది నాగరాజు కుటుంబం. రోజూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు సంపాదించడం, ఆరుగురు తినడంతో ఆర్థిక సమస్యలు వెంటాడడం మొదలయ్యాయి.
భారమైన కుటుంబ పోషణ
కుటుంబ పోషణ భారమైంది. చివరకు దంపతుల మధ్య కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో భార్యను కాసింత గట్టిగా మందలించాడు ఆమె భర్త. దీంతో మనస్తాపంతో గురైన భాగ్యలక్ష్మి ఆత్మహత్య ఆదివారం రాత్రి పురుగుమందు తాగింది. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
ALSO READ: వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపిన జనాలు
పిల్లల పరిస్థితి ఏంటి?
భార్య చనిపోయిందన్న విషయం తెలియగానే మనస్తాపానికి గురయ్యాడు నాగరాజు. అతడు కూడా పురుగుమందు తాగాడు. చికిత్స నిమిత్తం నాగరాజును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అరగంటలో భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. దీని సంబంధించి పోలీసులకు ఎవరు ఫిర్యాదు చేయలేదు. తల్లిదండ్రులను కోల్పోయి నలుగురు పిల్లలు అనాథలు అయ్యారు. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియని వయస్సు ఆ నలుగురు పిల్లలది. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 65 నెంబర్ ఇస్నాపూర్ చౌరస్తా ట్రెండ్స్ ముందు బైక్ ని ఢీ కొట్టింది టిప్పర్. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ఘటనలో స్వల్ప గాయాలతో భర్త , కుమారుడు బయట పడ్డారు. కాకపోతే ఆ ఫ్యామిలీ ఇల్లాలను కోల్పోయింది.
యాక్సిడెంట్ నేపథ్యంలో ఆ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనదారుల నుంచి వివరాలు సేకరించారు పోలీసులు.