OTT Movie : రొమాంటిక్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఇష్టపడతారు.అయితే కొన్ని సినిమాలు రొమాన్స్ ఒకటే కాకుండా, స్టోరీ కూడా చాలా చక్కగా ఉంటుంది. టైటానిక్ జంట కేట్ విన్స్లేట్, డి కాప్రియో జంటగా నటించిన మరో లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, పారిస్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. ఆ తర్వాత కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లిద్దరి మధ్య స్టోరీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ హాలీవుడ్ మూవీ పేరు ‘రివల్యూషనరీ రోడ్’ (Revolutionary Road). ఈ మూవీకి సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. ఇందులో లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ ప్రధాన పాత్రలు పోషించగా, మైఖేల్ షానన్, కాథరిన్ హాన్, డేవిడ్ హార్బర్, కాథీ బేట్స్ సహాయక పాత్రల్లో నటించారు. డికాప్రియో, విన్స్‌లెట్ గతంలో 1997 లో వచ్చిన ‘టైటానిక్’ లో కలిసి నటించారు. ఆ తరువాత విన్‌స్లెట్ ‘రివల్యూషనరీ రోడ్’ మూవీ స్క్రిప్ట్‌ని చదివి, ఆమె అప్పటి భర్త మెండిస్‌ని దర్శకత్వం వహించమని అడిగింది. అంతే గాక డికాప్రియో ను హీరో పాత్రను పోషించమని ఒప్పించింది. పారామౌంట్ పిక్చర్స్ ద్వారా ‘రివల్యూషనరీ రోడ్’ డిసెంబర్ 26, 2008న యునైటెడ్ స్టేట్స్‌లో థియేట్రికల్‌గా విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో, హీరోయిన్ ఒక పార్టీలో కలుసుకుంటారు. హీరోయిన్ సినిమాలలో నటించి బాగా సెటిల్ అవ్వాలనుకుంటుంది. హీరో కూడా డబ్బు సంపాదించి ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటాడు. అలా వీళ్ళిద్దరి అభిప్రాయాలు కలిసి పెళ్లి కూడా చేసుకుంటారు. ఏడు సంవత్సరాలు చూస్తూ ఉండగానే అలా గడిచిపోతాయి. ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా పుడతారు. అయితే వీళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. హీరోకి అదే ఉద్యోగం, హీరోయిన్ కూడా స్టేజ్ షో లు వేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ప్యారిస్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అయితే అక్కడ జీవించడం చాలా కాస్ట్లీ. అయితే భార్య ఇష్టం కాదనలేక వెళ్దామని అనుకుంటాడు హీరో. ఇంతలోనే హీరోకి ఆఫీసులో ఒక అమ్మాయి తో పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. అదే రోజు బర్త్ డే ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈరోజు బర్త్డే కావడంతో ఇల్లంతా డెకరేట్ చేస్తుంది హీరోయిన్. హీరో చాలా లేటుగా ఇంటికి వెళ్తాడు. హీరోయిన్ అతనికి బర్త్ డే సర్ప్రైజ్ చేస్తుంది. అప్పుడు హీరో చాలా ఎమోషనల్ అవుతాడు. ఆమెకు జరిగిన విషయం కూడా చెప్తాడు. ఇంతలోనే ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయాలు తట్టుకోలేక చాలా బాధపడుతుంది హీరోయిన్. చివరికి ఈ జంట పారిస్ కి వెళ్తారా? మరి ఏమైనా సమస్యలు వస్తాయా? మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, ఈ రొమాంటిక్ మూవీ పై ఓ లుక్ వేయండి.