BigTV English

Wife Tortured Husband: ఘట్‌కేసర్‌లో దారుణం.. ఆస్తికోసం భర్తను బంధించిన భార్య..!

Wife Tortured Husband: ఘట్‌కేసర్‌లో దారుణం.. ఆస్తికోసం భర్తను బంధించిన భార్య..!

Wife Tortured Husband for Property in Hyderabad: భార్యను చిత్ర హింసలు పెట్టిన భర్త.. వంటిళ్లు తప్ప వీధి మొహం కూడా చూడని భార్య.. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న భార్య.. ఇవన్ని ఒకప్పటి వార్తలు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఇలాంటి వార్తలు రివర్స్ లో చెప్పుకునే టైమ్ వచ్చేసింది. భర్తలను చిత్రహింసలు పెడుతున్న భార్యలు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే భార్య బాధితుల సంఘాలు కూడా పుట్టుకొచ్చాయి. ఎందుకిదంతా చెప్పాల్సి వస్తుందంటే మానవత్వం ఏమైంది అని అనుమానం కలిగేలా మేడ్చల్ జిల్లాలో ఓ మహిళ ప్రవర్తించింది.


మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ అంబేద్కర్ నగర్‌లో భర్తను చిత్రహింసలు పెట్టింది ఓ భార్య. భర్తను గొలుసులతో కట్టి ఓ చిన్న రూంలో ఏకంగా మూడు రోజుల పాటు బంధించింది.

Also Read: Killer nurse sentenced: నర్సు కాదు ఓ కిల్లర్.. 700 ఏళ్ల జైలు


బుడగ జంగాల కాలనీలో పత్తి నర్సింహ, భారతి దంపతులు నివాసం ఉంటున్నారు. నర్సింహ సెంట్రింగ్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్నారు. భార్య భర్తల పేరున రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఆస్తి విషయంలో పత్తి నర్సింహ, భారతి మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యతో పడలేక నర్సింహ.. ఏడాది క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.

అయితే.. 3 రోజుల క్రితం భర్త ఆచూకీ తెలుసుకున్న భారతి.. కుల పెద్దలు, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన్ని తీసుకొచ్చింది. తర్వాత ఆయన్ని ఇంట్లో ఓ గదిలో గొలుసుతో కట్టి నిర్భందించింది. తిండి, నిద్రతో పాటు అన్ని అవే గదిలో చేస్తూ నర్సింహ చిత్ర హింసలు అనుభవించాడు. గదిలో ఆయన ఉన్న అతను తన చిత్రవధను ఓ వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది.

Also Read: పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పత్తి నర్సింహ విడిపించి వైద్యం చేయించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే గొలుసులతో కట్టి చిత్రహింసలు పెట్టిన భార్యను చూసి తోటి మహిళలు అవాక్కయ్యారు.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×