Hyderabad News: వివాహేతర బంధానికి అడ్డుపడుతున్నాడని తండ్రిపై కోపం పెంచుకుంది కూతురు. తల్లి, ప్రియుడి సాయంతో చంపేసి, ఏమీ తెలియనట్టు సెకండ్ షో సినిమాకు వెళ్లింది. ఆ తర్వాత శవాన్ని వాహనంలో తీసుకెళ్లి చెరువులో పడేసింది. సంచలన రేపిన ఈ ఘటన మల్కాజ్‌గిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌లో వెలుగుచూసింది.
హైదరాబాద్ కవాడిగూడకు ప్రాంతానికి లింగం-శారద దంపతులు. వీరికి రెండు దశాబ్దాల కిందట పెళ్లి అయ్యింది. పాతబస్తీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు లింగం. ఆమెభార్య జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కూతురు మనీషాకు పెళ్లి చేశారు లింగం దంపతులు.
మనీషా భర్తకు ఓ స్నేహితుడు ఉండేవాడు. జవహర్‌నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావీద్. వీలు చిక్కినప్పుడల్లా ఫ్రెండ్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మనీషా.. మహ్మద్ జావీద్‌తో వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో మనీషాను భర్త వదిలివేశాడు.
చివరకు ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దెకు ఉంటోంది మనీషా. కూతురు వివాహేతర సంబంధం నచ్చని లింగం.. ఆమెతో పలుమార్లు గొడవకు దిగాడు. తనకు నాన్న అనుమానిస్తున్నాడని, వేధిస్తున్నాడని తల్లి శారద ఒకటికి రెండు కల్పించి చెప్పింది. ఎలాగైనా తండ్రిని చంపకుంటే తన పరువు బజారున పెడుతుందని భావించింది మనీషా.
ALSO READ: చిన్నారిని నీటిలో మరిగించి చంపిన తల్లి
జులై ఐదున మెడికల్ షాపుకి వెళ్లి మాత్రలు తీసుకురావాలని తల్లికి చెప్పింది. అవి నిద్రమాత్రలు అన్న విషయం తల్లికి తెలీదు. వాటిని కల్లుతో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. మనీషా, ఆమె ప్రియుడు జావీద్, తల్లి శారద కలిసి లింగం ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చంపేశారు. ఈ ఘటన తర్వాత సెకండ్ షో సినిమాకు వెళ్లారు.
తండ్రి మృతదేహాన్ని చెరువులో పడేయాలని డిసైడ్ అయ్యింది. అందుకోసం సినిమా నుంచి వస్తున్నప్పుడు క్యాబ్ బుక్ చేసింది. మృతదేహాన్ని కారు ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానం వచ్చింది. దీంతో ప్రశ్నించడం మొదలుపెట్టాడు. చివరకు డ్రైవర్‌ని కన్వీన్స్ చేసింది మనీషా. చివరకు చెరువు సమీపంలో దిగిపోయారు. డబ్బులు తీసుకుని డ్రైవర్ వెళ్లగానే తండ్రి మృతదేహాన్ని చెరువులో పడేసింది.
ఈ ఘటన ఐదున జరిగింది. 7న ఘట్‌కేసర్ మండలంలోని ఎదులాబాద్ చెరువులో గుర్తు తెలియని మృతదేహం స్థానికుల కంట పడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై గాయాలు కనిపించాయి. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చివరకు వడ్లూరి లింగంగా గుర్తించారు. ఈ క్రమంలో తల్లి, కూతుళ్లను విచారణకు పిలిచారు పోలీసులు.
కల్లు తాగే అలవాటు ఉన్న లింగం, అందరితో గొడవపడి ఈనెల 6న ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. వారి మాటలపై పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. దీంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపెట్టారు. చివరకు తల్లి శారద, కూతురు మనీషా, ఆమె ప్రియుడు జావీద్ అరెస్టు చేశారు.
ప్రియుడు కోసం తల్లితో కలిసి కన్న తండ్రిని కడతేర్చిన కూతురు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలో దారుణ ఘటన
వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిన కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగంను ప్రియుడు జావిద్ కలిసి హత్య చేసిన కూతురు మనీషా, తల్లి శారద
ఎదులాబాద్ చెరువులో తండ్రి శవాన్ని… pic.twitter.com/rgU4e4a7oo
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025