BigTV English

SKY – Wimbledon: కోహ్లీ బాటలో సూర్య ఫ్యామిలీ.. క్యూట్ ఫోటోలు వైరల్

SKY – Wimbledon: కోహ్లీ బాటలో సూర్య ఫ్యామిలీ.. క్యూట్ ఫోటోలు వైరల్

SKY – Wimbledon: ఇంగ్లాండ్ వేదికగా 2025 వింబుల్డన్ {Wimbledon} హోరాహోరీగా సాగుతుంది. ఈ టోర్నీలో సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. ఈసారి వింబుల్డన్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన నోవాక్.. క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకు వెళ్ళాడు. తాజాగా రౌండ్ 16 లో అలెక్స్ మినార్ తో పోటీపడి.. గ్రాండ్ విక్టరీ కొట్టాడు. అయితే జొకోవిచ్ ఆడుతుండడంతో ఈ మ్యాచ్ కి భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే జోకోవిచ్ మ్యాచ్ ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.


Also Read: Kholi – Avneet kaur: విరాట్ కోహ్లీని నీడలా వెంటాడుతున్న ఆ అందాల తార… షాక్ లో అనుష్క శర్మ

వింబుల్డన్ కి విరాట్ కోహ్లీ:


టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఐపీఎల్ తర్వాత తొలిసారి ఈ స్టేడియంలో తలుక్కుమన్నాడు. జొకోవిచ్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తన సతీమణి అనుష్క శర్మతో కలిసి మైదానానికి వచ్చాడు. విరాట్ కోహ్లీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేకమంది అథ్లెట్లు ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు వచ్చారు. టెస్ట్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వన్డే సిరీస్ లేకపోవడంతో రీఫ్రెష్ మూడ్ లో ఉన్నాడు. దీంతో లండన్ లో ఉంటున్న కోహ్లీ.. ఈ వింబుల్డన్ మ్యాచ్ కి వెళ్ళాడు.

ఇంగ్లాండ్ కి సూర్య కుమార్ యాదవ్:

అయితే కోహ్లీ మాత్రమే కాకుండా భారత టి-20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ వింబుల్డన్ మ్యాచ్ వీక్షించేందుకు హాజరయ్యాడు. ఆ మధ్య సూర్యకుమార్ యాదవ్ హడావిడిగా ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ హెర్నియా సంబంధిత గాయానికి చికిత్స కోసం అతడు ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఈ క్రమంలో గత నెల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో అతడికి శస్త్రచికిత్స జరిగింది. తన శస్త్ర చికిత్స విషయాన్ని ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశాడు సూర్య కుమార్ యాదవ్.

అతడు కొంతకాలంగా పొత్తికడుపులో కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ఈ ఆపరేషన్ కోసమే ఇటీవల జర్మనీ వెళ్ళాడు. ఈ చికిత్స ముగిసి.. ప్రస్తుతం కోలుకున్నాడు. మరో వారంలో అతడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో పునరావాసం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇది సూర్య కుమార్ యాదవ్ కి మూడో సర్జరీ. అతడికి 2023లో మడమకు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 2024 లోను హెర్నియాకు చికిత్స చేయించుకున్నాడు.

Also Read: Sara Tendulkar: కొత్త ప్రియుడుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సచిన్ కూతురు సారా… షాక్ లో గిల్!

ఇప్పుడు కుడి వైపుకి అదే హెర్నియా చికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీ తర్వాత సూర్యకి కొంతకాలం రెస్ట్ అవసరం. ఆగస్టు లోనే అతడు మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెడతాడు. ఒకవేళ ఆగస్టులో బంగ్లాదేశ్ తో జరగనున్న టి-20 సిరీస్ కి అన్ ఫిట్ గా ఉంటే కచ్చితంగా దూరమవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ చికిత్స నుంచి కాస్త కోలుకున్న సూర్య కుమార్ యాదవ్.. తాజాగా ఈ వింబుల్డన్ 2025 కి తన భార్య దివిషా శెట్టితో కలిసి హాజరయ్యాడు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో సూర్య కుమార్ యాదవ్ ఫ్యామిలీ కూడా కోహ్లీ బాటలోనే నడుస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×