E-Paper
Advertisement

Delhi Crime: సహజీవనంలో డబ్బుల చిచ్చు.. భాగస్వామి గొంతు నొక్కి చంపేసి, ఆ తర్వాత ఏం చేశాడంటే

Delhi Crime: సహజీవనంలో డబ్బుల చిచ్చు.. భాగస్వామి గొంతు నొక్కి చంపేసి, ఆ తర్వాత ఏం చేశాడంటే
Advertisement

Delhi Crime: సహజీవనం పేరుతో యువతీయువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.  క్షణికావేశంలో చివరకు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. అలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో చాలానే జరుగుతున్నాయి. తాజాగా మద్యం మత్తులో భాగస్వామితో గొడవపడ్డాడు ఓ వ్యక్తి. ఆమె గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని కారులో వదిలేశాడు. సంచలనం రేపిన ఈ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది?

సహజీవనంలో డబ్బుల చిచ్చు

Advertisement

ఢిల్లీలోని నజాఫ్‌గఢ్ నివాసి 35 ఏళ్ల వీరేంద్రసింగ్.  బస్సు డ్రైవర్ గా జీవితం సాగిస్తున్నాడు. భార్యా పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నాడు. ఇదిలాఉండగా రెండేళ్లుగా ఓ మహిళ‌తో సహజీవనం చేస్తున్నాడు వీరేంద్ర. ఆగస్టులో ఆ మహిళ పాలంలో ఉన్న ఇంటిని అమ్మేసింది. వచ్చిన డబ్బుతోచావ్లాలో మూడంతస్తుల ఇంటిని కొనుగోలు చేశాడు. అదనంగా రూ. 21 లక్షలు వీరేంద్ర వద్ద ఉంది.

ఈ వ్యవహారమై వీరిద్దరి మధ్య తరచు గొడవలు జరిగేవి. బుధవారం తెల్లవారుజామున వీరేంద్ర, పార్టనర్ మహిళ పుల్‌గా మద్యం తాగి మళ్లీ గొడవపడ్డారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన వీరేంద్ర, మంచంపైనున్న ఆమె గొంతుపై చేయి వేశాడు. ఆమెకి ఊపిరాడకపోవడంతో మృతి చెందింది. హత్య తర్వాత వీరేంద్ర ఇద్దరు ఫ్రెండ్స్‌ని పిలిచాడు.

Advertisement

భాగస్వామిని చంపేసి మృతదేహాన్ని కారులో వేశాడు

ఒకరు పురుషుడు కాగా, మరొకరు మహిళ. మొత్తం ముగ్గురు కలిసి పార్టనర్ మృతదేహాన్ని కారు వద్దకు తెచ్చాక ఫ్రెండ్స్ వెళ్లిపోయారు. అప్పటికే మత్తులోకి జారుకున్న వీరేంద్ర, కారు నడిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. కేవలం 100 మీటర్లు మాత్రమే డ్రైవ్ చేశాడు. చివరకు ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయాడు.

ALSO READ: మూడేళ్ల కొడుకు గొంతు కోసిన తల్లి, ఆపై ఆత్మహత్య 

గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఇరుగుపొరుగువారు కారులో మృతదేహాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్నట్లు పోలీసులు, నిద్రలో ఉన్న వీరేంద్రను అరెస్టు చేశారు. కారు వెనుక సీటులో మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. మహిళ ముఖంపై గాయాలు, గీతలున్నాయి. అతడి ఫ్రెండ్స్ కోసం గాలిస్తున్నారు. సహజీవనం ఏమోగానీ.. కేవలం డబ్బు కారణంగా ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టేసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×