Delhi News: ఒకప్పుడు దోపిడీ దొంగలు.. సీరియల్ కిల్లర్లను పట్టుకోలేక పోయేవారు. టెక్నాలజీ వచ్చిన వారంతా అడ్డంగా దొరికిపోతున్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఢిల్లీ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీరియల్ కిల్లర్ అజయ్ లాంబాను ఎట్టకేలకు అరెస్టు చేశారు ఢిల్లీ పోలీసులు. అసలు సీరియల్ వ్యవహారంపై ఓ లుక్కేద్దాం.
అజయ్ లాంబా.. వీడొక సీరియల్ కిల్లర్. హత్యలు చేయడంతో వీడు ఆరిన తేరిపోయాడు. టాక్సీని అద్దెకు తీసుకున్న తర్వాత డ్రైవర్‌తో మాటలు కలుపుతాడు. ఆ తర్వాత వారికి ఏదో విధంగా మత్తు మందు ఇచ్చి హత్యలు చేయిస్తాడు. వారి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పారివేయడం వీడికి వెన్నతో పెట్టిన విద్య.
అద్దెకు తీసుకున్న ట్యాక్సీని అక్రమంగా నేపాల్ సరిహద్దు దాటించి విక్రయించి సొమ్ము చేసుకుంటాడు. నేరాలకు పాల్పడేటప్పుడు అజయ్ ఒంటరిగా ఉండేవాడు కాదు, వీడికి పెద్ద గ్యాంగ్ ఉండేది. సరిగ్గా 2001లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాలలోని పలువురు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడ్డాడు. పాపం పండడంతో చివరకు పోలీసులకు చిక్కాడు.
ఈ సీరియల్ కిల్లర్ అజయ్ గురించి కొత్త కొత్త విషయాలు బయటపెట్టారు ఢిల్లీ పోలీసులు. అజయ్ లాంబా.. క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని నాలుగు కిరాతక హత్యకు పాల్పడ్డాడు. సహచరులతో కలిసి టాక్సీలను అద్దెకు తీసుకునేవాడు. ప్లాన్ ప్రకారం క్యాబ్ డ్రైవర్లను హత్య చేసి వాహనాలను దొంగిలించేవాడు. ఆ మృతదేహాలను గుర్తించకుండా మారుమూల పర్వత ప్రాంతాల్లో అడవుల్లో విసిరివేసేవాడని తెలిపారు.
ALSO READ: పాలలో ఉమ్మి.. శివభక్తుల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..
కిల్లర్ లాంబా బారిన పడిన నలుగురిలో కేవలం ఓ క్యాబ్ డ్రైవర్ మృతదేహం దొరికింది. లాంబాపై నాలుగు హత్య-దోపిడీ కేసులు నమోదయ్యాయి. గతంలో అతడి ముఠాలోని సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. లాంబా సహచరులు ఇదే తరహాలో మరిన్ని నేరాలకు పాలుపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. మెయిన్ వ్యక్తి దొరికినా, గ్యాంగ్‌లోని కొందరి సభ్యుల ఆచూకీ తెలియాల్సివుంది.
48 ఏళ్ల అజయ్ లాంబాకి పెద్ద హిస్టరీయే ఉంది. ఢిల్లీకి చెందిన లాంబా.. ఆరో తరగతిలో చదువు మానేశాడు. తొలుత ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి వెళ్లాడు. అక్కడ ధీరేంద్ర, దిలీప్ అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరంతా కలిసి దోపిడీలు, హత్యలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి వేర్వేరు ప్రాంతాలకు మకాం మార్చాడు.
అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటం వంటి కేసుల్లో లాంబాపై కేసులు ఉన్నాయి. 2008-18 వరకు అంటే దశాబ్దం పాటు నేపాల్‌లో నివసించాడు సీరియల్ కిల్లర్. కుటుంబంతో కలిసి డెహ్రాడూన్‌కు మారాడు. ఏళ్ల తరబడి మాన్యువల్-సాంకేతిక నిఘా ద్వారా అతడ్ని ట్రాక్ చేస్తూనే ఉన్నారు పోలీసులు.
ఐదేళ్ల కిందట ఒడిశా నుంచి ఢిల్లీలోని ఇతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల కిందట డిల్లీలోని సాగర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద నమోదు అయ్యింది. ఏడాది కిందట ఒడిషాలోని బరంపూర్‌లో బంగారం షాపు దోపిడీ కేసులో అరెస్టయ్యాడు. ఈ కేసుల్లో లాంబా బెయిల్‌పై ఉన్నాడు.