OTT Movie : వింత వింత జీవులను తెరపై చూడడం చెప్పలేనంత ఆశ్చర్యంగానూ, మరింత ఇంట్రెస్టింగ్ గానూ ఉంటుంది. అయితే ఎప్పుడైనా జంతువులు కూడా మనుషులుగా మారి మానవ జాతి అంతు చూస్తే ఎలా ఉంటుందోనని ఆలోచించారా? లేదు కదా. అయితే ఈ మూవీని చూడాల్సిందే. మరి ఈ వింత జీవులున్న ఇంట్రెస్టింగ్ సై-ఫై థ్రిల్లర్ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
ఈ చిత్రం కథ మొత్తం ఒక ఊహాత్మక ప్రపంచంలో జరుగుతుంది. ఇక్కడ కొంతమంది మానవులు రహస్యమైన జన్యు మ్యూటేషన్ కారణంగా క్రమంగా జంతువులుగా మారతారు. కొందరు పక్షులు, సరీసృపాలు, లేదా ఇతర జాతుల హైబ్రిడ్‌లుగా మారుతారు. కథ ఫ్రాంస్వా అనే తండ్రి, అతని 16 ఏళ్ల కొడుకు ఎమిలే చుట్టూ తిరుగుతుంది. ఫ్రాంస్వా భార్య లానా (ఫ్లోరెన్స్ డెరెట్జ్) ఈ మ్యూటేషన్‌తో బాధపడుతూ, ఒక ప్రభుత్వ సంస్థలో చికిత్స పొందుతుంది. ఆమెను కలవడానికి ఫ్రాంస్వా , ఎమిలే దక్షిణ ఫ్రాన్స్‌కు వెళ్తారు. కానీ ఒక రోడ్డు ప్రమాదం తర్వాత లానాతో సహా హైబ్రిడ్‌లు అడవిలోకి పారిపోతారు.
అయితే సమాజం మ్యూటెంట్‌లను భయపడుతూ, వారిని ఆసుపత్రులు లేదా జూ-వంటి కేంద్రాలలో బంధిస్తుంది. ఫ్రాంస్వా తన భార్యను రక్షించడానికి, కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఎమిలే తన సొంత శరీరంలో మార్పులను గమనిస్తాడు. దానిని రహస్యంగా దాచడానికి ప్రయత్నిస్తాడు. కొత్త పాఠశాలలో ఎమిలే సహవిద్యార్థి నీనా (బిల్లీ బ్లైన్)తో స్నేహం చేస్తాడు. స్థానిక పోలీసు అధికారి జూలియాను కలుస్తాడు. ఇక్కడ కథలో ఉత్కంఠభరితమైన ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇంతకీ మనుషులు జంతువులుగా ఎందుకు మారుతున్నారు? హీరోలోని మార్పులు చివరికి బయట పడ్డాయా? వాటివల్ల ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవలసి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : చచ్చేదాకా పొట్టుపొట్టు కొట్టుకునే చావే లేని అమ్మాయిలు… ఓటీటీలో దుమ్మురేపుతున్న లేడీ యాక్షన్ ఎంటర్టైనర్
ఓటీటీ డీటైల్స్
“ది యానిమల్ కింగ్‌డమ్” (the animal kingdom) అనే ఈ మూవీ 2023లో వచ్చిన ఫ్రెంచ్ సైన్స్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా చిత్రం. థామస్ కైలీ దర్శకత్వంలో రూపొందింది. రొమైన్ డురిస్ (ఫ్రాంస్వా), పాల్ కిర్చర్ (ఎమిలే), అడెలె ఎక్సార్కోపౌలోస్ (జూలియా) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ అదిరిపోయే ఫ్యాంటసీ థ్రిల్లర్ చూడాలి అనుకుంటే ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. కాబట్టి ఈ సై-ఫై అడ్వెంచర్ ఫ్యాంటసీ మూవీని మిస్ అవ్వకుండా చూడండి. చూశాక ఖచ్చితంగా వర్త్ వాచింగ్ మూవీ మావా అంటారు.