BigTV English

OTT Movie : కాన్సర్ట్ పేరుతో ట్రాప్… వేలమందిని టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : కాన్సర్ట్ పేరుతో ట్రాప్… వేలమందిని టార్గెట్ చేసే సీరియల్ కిల్లర్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్

OTT Movie : సైకో థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాంటి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇప్పటిదాకా సైకో కిల్లర్ అనగానే ఏదో ఒక రీజన్ తో మనుషుల్ని కిడ్నాప్ చంపుతూ, పోలీసులకు చుక్కలు చూపించే స్టోరీలనే చూశాము. కానీ ఇందులో మాత్రం వేల మంది ఉన్న ఒక కాన్సర్ట్ లో తిరుగుతూ తీవ్ర గందరగోళం సృష్టిస్తాడు సైకో. ఈ ఇంట్రెస్టింగ్ కిల్లర్ మూవీ పేరు ఏంటి? ఏ ఓటీటీలో ఉందో చూసేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…
ఫిలడెల్ఫియా ఫైర్‌ ఫైటర్ అయిన కూపర్ అబాట్ (జోష్ హార్ట్‌నెట్)కు టీనేజ్ కుమార్తె రిలే (ఏరియల్ డోనోగ్) ఉంటుంది. చదువులో ఆమె సాధించిన మంచి గ్రేడ్స్‌కు బహుమతిగా పాప్ స్టార్ లేడీ రావెన్ (సలేకా శ్యామలన్) కాన్సర్ట్ కి తీసుకెళ్తాడు. కాన్సర్ట్ వేదిక వద్ద విచిత్రంగా ఎక్కువ మంది పోలీసులు ఉండడం గమనించిన కూపర్, జామీ అనే వ్యక్తి నుంచి నుండి FBI సీరియల్ కిల్లర్ “ది బుచర్”ను పట్టుకోవడానికి ఒక ఉచ్చు ఏర్పాటు చేసిందని తెలుసుకుంటాడు. ఇక్కడే షాకింగ్ ట్విస్ట్‌ రివీల్ అవుతుంది.

ఆలస్యం చేయకుండా కూపర్ తన ఫోన్ లో ఉన్న వీడియోను సీక్రెట్ గా చెక్ చేసుకుంటాడు. కుమార్తెకు తన నిజస్వరూపం తెలియకుండా, పోలీసుల నుండి తప్పించుకోవడానికి తన తెలివితేటలను ఉపయోగిస్తాడు. అతను జామీ ID కార్డ్‌ను దొంగిలించి, ఉద్యోగి పాస్‌వర్డ్ ను తెలుసుకుని, బ్యాక్‌రూమ్‌కు యాక్సెస్ పొందుతాడు. అలాగే పోలీసు రేడియోను దొంగిలిస్తాడు. FBI ప్రొఫైలర్ డాక్టర్ జోసెఫిన్ గ్రాంట్ నేతృత్వంలోని మాన్‌హంట్‌ను గమనిస్తూ, కూపర్ ఒక ఫుడ్ స్టాండ్‌లో బాంబ్ పేల్చి, ఆ గందరగోళంలో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతకీ కూపర్ కు తెలిసిన ఆ షాకింగ్ విషయం ఏంటి ? కిల్లర్ పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటే ఇక్కడ హీరో ఎందుకు ఎస్కేప్ అవ్వాలి అనుకుంటాడు? అతని ఫోన్లో ఉన్న సీక్రెట్ వీడియో ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


Read Also : హిల్ స్టేషన్ లో ఇల్లు… చేయకూడని పని చేసి అడ్డంగా బుక్కయ్యే అబ్బాయి… స్పైన్ చిల్లింగ్ కొరియన్ థ్రిల్లర్

ఏ ఓటీటీలో ఉందంటే?
“ట్రాప్” (Trap) మూవీ ఉత్కంఠభరితమైన సైకలాజికల్ థ్రిల్లర్. 2024లో తెరపైకి వచ్చిన ఈ మూవీ డైరెక్టర్ M. నైట్ శ్యామలన్ సిగ్నేచర్ ట్విస్ట్‌లతో పక్కా థ్రిల్లింగ్ స్టోరీ. ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ప్రస్తుతం ఇది నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×