Viral Video: రోజు రోజుకు మనుషులు మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా యూపీలోని లక్నోలో ఓ పాల వ్యాపారి చేసిన పని తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అయ్యింది. లవ్ శుక్లా అనే వ్యక్తి రోజూ పప్పు అనే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేస్తాడు. కానీ, తాజాగా పప్పు చేసిన పని చూసి లవ్ శుక్లా షాకయ్యాడు. రోజూ తాను ఆ పాలు శివుడి అభిషేకానికి, నైవేధ్యానికి వాడుతానని చెప్పాడు. అలాంటి పాలను సదరు వ్యాపారి కలుషితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఇంతకీ పాల వ్యాపారి ఏం చేశాడంటే?
లవ్ శుక్లా అనే వ్యక్తి రోజూ పప్పు అనే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేస్తాడు. కానీ, తాజాగా సదరు పాల వ్యాపారి చేసిన పని చూసి లవ్ శుక్లా షాకయ్యాడు. ఎప్పటి లాగే పాల వ్యాపారి పాల టిఫిన్ తో లవ్ శుక్లా వాళ్ల ఇంటి దగ్గరికి వచ్చాడు. అతడు కాలింగ్ బెల్ కొట్టాక.. పాల టిఫిన్ మూత తీసి అందులో ఉమ్మేస్తాడు. ఈ ఘటన అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనుమానం వచ్చి లవ్ శుక్లా సీసీ ఫుటేజీని పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది.
‘స్పిట్ జిహాద్’పై సోషల్ మీడియాలో దుమారం
తనకు ఇచ్చిన పాలలో పప్పు ప్రతి రోజు ఉమ్మేస్తున్నాడని లవ్ శుక్లా గుర్తించాడు. దీనిని ‘స్పిట్ జిహాద్’గా అభివర్ణించాడు. ఈ ఘటనకు సంబందించి శుక్లా కుటుంబం గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే, ఇంతకాలం పప్పు పేరుతో పాలు పోస్తున్న సదరు వ్యాపారి పేరు మహ్మద్ షరీఫ్ అని గుర్తించారు. పప్పు అనే మారుపేరుతో అతడు పాలు పోస్తున్నట్లు గుర్తించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘స్పిట్ జిహాద్’ రోజు రోజుకు మరింత వ్యాప్తి చెందుతుందని హిందూ మహాసభ ప్రతినిధులు తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పిడిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయాలని సంస్థ జాతీయ ప్రతినిధి శిష్య చతుర్వేది డిమాండ్ చేశారు.
Read Also: రాత్రికి రాత్రే రూ.2000 కోట్లకు అధిపతి అయిపోయాడు.. అంతా ఆ లాటరీ మహిమే!
పోలీసులు ఏం చెప్పారంటే?
శివుడి పూజకు ఉపయోగించే పాల విషయంలో ఇలా చేయడం దారుణం అని శుక్లా తెలిపారు. అటు పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారు. “సీసీటీవీ ఫుటేజీలో తాగే పాలలో ఉమ్మేస్తున్నట్లు కనిపించింది. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే అసలు నిజాలు తెలుస్తాయి” అని పోలీసు అధికారులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Read Also: జాలీగా జలకాలాడుతుంటే.. మెడపై మెత్తగా ఏదో తగిలింది.. ఇక పరుగో పరుగు!