Delhi Restaurant Fire: దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం ఎంత వేగంగా వ్యాపించిందంటే, లోపల ఉన్నవారు బయటపడే లోపే దట్టమైన పొగ, మంటలు ముంచెత్తాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాద సమయంలో రెస్టారెంట్‌లో జనం రద్దీగా ఉండటంతో.. లోపలే చిక్కుకున్నమరో 40 మందిని కాపాడిన సహాయక బృందాలు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చి, లోపల ఉన్నవారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్స్ శ్రమిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!