E-Paper
Advertisement

Dhurandhar Actor Arrest: బుక్కైన దురంధర్ నటుడు.. అత్యాచారం కేసులో అరెస్ట్, పోలీసుల కస్టడీలో

Dhurandhar Actor Arrest: బుక్కైన  దురంధర్ నటుడు.. అత్యాచారం కేసులో అరెస్ట్, పోలీసుల కస్టడీలో
Advertisement

Dhurandhar Actor Arrest: దురంధర్ మూవీతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు నదీమ్ ఖాన్‌. ఈ సినిమా వల్ల వచ్చిన పేరు ఏమోగానీ అడ్డంగా బుక్కయ్యాడు. ఆయన్ని ఓ కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది?

బుక్కైన దురంధర్ నటుడు నదీమ్‌ఖాన్‌

Advertisement

దురంధర్ నటుడు నదీమ్‌ఖాన్‌ అత్యాచారం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పని చేసే ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. వివాహం చేసుకుంటానని నమ్మించి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

మహిళ వేర్వేరు నటుల ఇంటి పని మనిషిగా చేసింది. ఈ క్రమంలో నదీమ్‌ఖాన్‌తో పరిచయం ఏర్పడింది, ఆ తర్వాత వారు మరింత దగ్గరయ్యారు. ఖాన్ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చినట్టు పేర్కొంది. ఆ హామీ మేరకు మల్వానీలోని తన నివాసంలో పదేళ్లపాటు పలుమార్లు అత్యాచారం చేశాడని అందులో ప్రస్తావించింది.

Advertisement

అత్యాచారం కేసులో ముంబై పోలీసులు అరెస్ట్

ఆ తర్వాత ఆమెని వివాహం చేసుకోవడానికి నదీమ్ నిరాకరించాడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదుతో వెర్సోవా పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం మాల్వానీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. దీంతో ఈ కేసును అక్కడికి బదిలీ చేశారు.

కేసును విచారించిన మాల్వానీ పోలీసులు జనవరి 22న నదీమ్ ఖాన్‌ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఈ విషయాన్ని పోలీసులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం నదీమ్ ఖాన్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.  నదీమ్ ఖాన్ ఎవరు? సినిమాల్లో అతిథి పాత్రలు పోషించడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన ధురంధర్ సినిమాలో రెహ్మాన్ దకైత్ వంటవాడు పాత్రలో కనిపించాడు. ఆయన రూల్ చిన్నదైనప్పటికీ నటన అందరిని ఆకర్షించింది.

ALSO READ:  పండుగ పూట తీరని లోటు.. బాన్సువాడ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని మృతి

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×