ఓ హత్య కేసులో డోర్ కర్టన్ నింధితులను పట్టించింది. గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురవ్వగా.. పోలీసులకు నింధితులను పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది. కానీ ఓ కర్టన్ వల్ల వాళ్లు అడ్డంగా దొరికిపోయారి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం కోడిగాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని తుంకూర్ జిల్లాలో నివాసం ఉంటున్న మోహన్ కుమార్, అతని భార్య కవితకు కాపురంలో గొడవలు వచ్చాయి. గొడవలు పెరగడంతో భార్య కవిత తన కొడుకు కూతురును తీసుకుని అదే ప్రాంతంలో మరో ఇంటిని అద్దెకు తీసుకుని హోటల్ నిర్వహిస్తూ పిల్లలను పోశించుకుంటోంది.
ఈ క్రమంలో విద్యుత్ శాఖలో పనిచేసే ఓ ఉద్యోగితో కవితకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా కొద్ది రోజులకు అక్రమ సంబంధంగా మారింది. కవితతో అక్రమ సంబంధం పెట్టుకున్న పాషా ప్రతిరోజూ ఆమె ఇంటికి వస్తూ వెళుతుండేవాడు. ఈ విషయం కవిత భర్త మోహన్ కుమార్ కు తెలిసింది. దీంతో మోహన్ కుమార్ తరచూ భార్య దగ్గరకు వెళ్లి ఆమెను దూశించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవలు జరగ్గా ఉర్లో తన పరువు పోతుందని ఆమె భావించింది.
దీంతో తన భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. తన భర్తను అంతం చేసేందుకు పథకం రచించింది. ఈ పథకంలో కవితతో పాటు ఆమె కుమారుడు కౌశిక్, ప్రియుడు పాషా, హోటల్ లో పని చేసే వ్యక్తి ఉన్నారు. వీరంతా పక్కా ప్లాన్ ప్రకారం మోహన్ కుమార్ ను హత్య చేశారు. అనంతరం శవాన్ని గుర్తు పట్టరాకుండా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మడకశిర ప్రాంతంలోని హంద్రీనవా కెనాల్ పక్కన పడేశారు. మృతుడికి డోర్ కర్టన్ కట్టి ఉండటాన్ని పోలీసులు గమనించారు. అచ్చం అలాంటి డోర్ కర్టనే కవిత ఇంట్లో సైతం కనిపించగా పోలీసులు వారి స్టైల్ లో విచారణ జరిపారు. ఈ విచారణలో హంతకులు భార్య, కొడుకు, పాషా అని తేలింది. నింధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.