Nindu Noorella Saavasam Serial Today Episode : గార్డెన్ లో కూర్చున్న గుప్త, యముణ్ని మీరు ఏదో కారణం ఉంటేనే తప్పా భూలోకం రారని.. మళ్లీ ఆ బాలికకు ఏదైనా ప్రమాదం రాబోతుందా..? ప్రభూ అని అడుగుతాడు. యముడు మాత్రం పలకకుండా అలాగే ఉండిపోతాడు. అయితే ఏ రూపంలో ప్రమాదం పొంచి ఉంది ప్రభు అని గుప్త అడగ్గానే ఘోర రూపంలో ప్రమాదం రాబోతుందని ఈ సారి ఘోర తాంత్రిక విద్యలను బలంగా ఔపోసన పడుతున్నాడని ఆ శక్తితో కచ్చితంగా ఆ బాలికను బంధిస్తాడని యముడు చెప్పగానే గుప్త భయంతో వణికిపోతాడు. మీరు కూడా ఆ బాలికను కాపాడలేరా..? ప్రభు అంటూ అడగ్గానే కాపాడటం అంటే ఆ బాలికను ఇక్కడి నుంచి మన లోకానికి తీసుకుపోవడమే లేదంటే ఇక్కడే ఉంటే ఆ బాలికను కాపాడటం కష్టం అని యముడు చెప్తాడు. అది కూడా అమావాస్య గడియలు మొదలవ్వగానే ఆ బాలికను తీసుకెళ్లాలి అంటాడు.
మిస్సమ్మ ఇంటి దగ్గరకు అమర్ పిల్లలతో వస్తాడు. అమర్ బయటే రాథోడ్‌ను లోపలికి వెళ్లి మిస్సమ్మను తీసుకురమ్మని చెప్తాడు. దీంతో రాథోడ్ షాకింగ్ గా సార్ నేను విన్నదే మీరు అన్నారా..? తిట్టింది మీరు వెళ్లిపోమ్మంది పెద్ద సారు. మధ్యలో నేను వెళితే వస్తుందా..? సార్ అంటూ ప్రశ్నించడంతో అయితే పిల్లలను తీసుకుని వెళ్లు రాథోడ్ అంటూ పిల్లలను రాథోడ్ తో లోపలికి వెళ్లి మిస్సమ్మను తీసుకుని రండి త్వరగా వెళ్లాలి అని చెప్పగానే పిల్లలు రాథోడ్ తో వెళ్తుంటారు. అంజు మాత్రం తాను రానని డాడీ దగ్గరే ఉంటానని చెప్తుంది. అమ్ము పిలిచినా నేను డాడీకి తోడుగా ఉంటాను. అయినా నేను వచ్చి పిలిస్తే కానీ ఆ మిస్సమ్మ రాదా..? ఏంటి..? అని ఎదురు ప్రశ్నిస్తుంది. దీంతో అమర్ కోపంగా అంజు నువ్వు కూడా వెళ్లు అని చెప్పగానే అంజు వాళ్లతో కలిసి వెళ్తుంది.
ఇంట్లో మిస్సమ్మ ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతుంది. ఇంకా ఆయన పిల్లలు రాలేదేంటి అని ఎదురుచూస్తుంది. అప్పుడే అక్కడకు వచ్చిన మంగళ దీన్ని నా తమ్ముడికి ఇచ్చి కట్టబెట్టి నా కాళ్ల దగ్గర ఉంచుకుందామనుకుంటే పైకి ఎదిగిపోతుంది అని మనసులో అనుకుని బాధపడుతుంది. రామ్మూర్తి వచ్చి ఏటమ్మా అలా తిరిగుతున్నావు అని అడుగుతాడు. అయన, పిల్లలు నా కోసం వస్తున్నారని అత్తయ్య, మామయ్య ఫోన్ చేసి చెప్పారు నాన్నా. ఇంకా రాలేదేంటని చూస్తున్నాను అని చెప్తుంది. వస్తారులేమ్మా అంటూ నేను కాస్త బయటకు వెళ్లి వస్తాను అని రామ్మూర్తి బయటకు వెళ్తుంటే పిల్లలు ఇంట్లోకి వస్తుంటారు. అమర్ మాత్రం బయటే కారు దగ్గర నిలబడి ఉంటాడు. రామ్మూర్తి లోపలికి వెళ్లి మిస్సమ్మకు విషయం చెప్తాడు. దీంతో మిస్సమ్మ ఆయన వచ్చి పిలిస్తేనే రావాలని అత్తమ్య మామయ్య చెప్పారు. ఇప్పుడు ఆయన పిలవకుండా నేను ఎలా వెళ్లాలి నాన్న అంటుంది. అయితే బాబు గారు లోపలికి వచ్చి పిలవడానికి నేను చిన్న నాటకం ఆడతాను. నువ్వు కూడా సహకరించు తల్లి అంటాడు. సరే అంటుంది మిస్సమ్మ.
రామ్మూర్తి డోర్ దగ్గరకు వెళ్లి ఏంటి రాథోడ్ నేను లేనప్పుడే ఇంటికి వస్తావనుకున్నాను. నును ఉన్నప్పుడు కూడా వస్తున్నావా..? అంటూ వెటకారంగా అడుగుతాడు. దీంతో రాథోడ్ ఏమీ అర్తం కాక అటూ ఇటూ చూస్తుంటాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు సార్ అని అడుగుతాడు. దీంతో రామ్మూర్తి నేను లేనప్పుడు నా కూతురుని ఇంట్లో వదిలేసి వెళ్లావు కదయ్యా..? సరేలే ఎందుకు వచ్చావో చెప్పు. నా కూతురు ఎలా ఉందో చూసి వెళ్దామని వచ్చావా..? లేక ఆ ఇంట్లో వాళ్లు ఈ ఇంట్లో నా కూతురు ఎలా ఉందో చూడమని పంపించారా..? అని అడగ్గానే రాథోడ్ పిల్లలు అర్థం కాక చూస్తుండిపోతారు. తర్వాత రామ్మూర్తి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక రాథోడ్ మిస్సమ్మను నేను పిల్లలు వచ్చాం అని బయటకు రా అని పిలుస్తాడు.
మిస్సమ్మ పరుగెత్తుకొస్తుంది. పిల్లలను చూసి సంతోషంగా పలకరించబోతుంటే రామ్మూర్తి అపుతాడు. ఆ పిల్లలను చూసి నీ మనసు కరిగి ఉండవచ్చు కానీ నీకు జరిగిన అవమానం నా మనులో ఇంకా అలాగే ఉందమ్మా.. అని డైలాగులు చెప్తుంటే.. ఏంటి మిస్సమ్మ మీ నాన్న పెద్దరాయడితో రజనీకాంత్ లా భలే డైలాగులు చెప్తున్నాడు. అనగానే పిల్లలు మిస్సమ్మను ఇంటికి రమ్మని.. నువ్వు లేకపోతే ఇంట్లో ఉండలేకపోతున్నామని బాధపడుతూ చెప్తారు. రామ్మూర్తి మాత్రం మీ డాడీ వచ్చి పిలిచే వరకు నేను భాగీని పంపించను అంటాడు. దీంతో పిల్లలు మేము వచ్చాము కదా తాతయ్య మిస్సమ్మను మాతో పంపించండి అని అడుగుతారు. రామ్మూర్తి పంపించను అంటాడు. ఇంతలో అంజు కోపంగా ఇదంతా మిస్సమ్మ, తాతయ్య కలిసి నాటకం ఆడుతున్నట్టు ఉంది. నేను వెళ్లిపోతున్నాను అంటుంది. రాథోడ్.. అంజు పాప నువ్వు ఆవేశపడకు నేను వెళ్లి సారుకు విషయం చెప్తాను. సార్ ఏం అంటారో వింద్దాం. అని రాథోడ్ బయటకు అమర్ వద్దకు వెళ్తాడు.
ఇంట్లో కాలు నొప్పితో బాధపడుతున్న మనోహరి.. మిస్సమ్మను అమర్ మళ్లీ ఇంటికి తీసుకొస్తాడేమో.. అది మళ్లీ ఇంటికి వస్తే నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృథా అయిపోతుంది. దాన్ని ఇంటికి తీసుకురాకుండా ఏదైనా చేయాలి. అనుకుని మంగళకు ఫోన్ చేస్తుంది. మంగళ ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత బాబ్జికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లమనాలి అని ఫోన్ చేస్తుంది. బాబ్జీ ఫోన్ స్విచ్చాప్ వస్తుంది. దీంతో మనోహరి నేనే ఏదైనా చేయాలి అని ఆలోచిస్తుంది.
బయట ఉన్న అమర్ దగ్గరకు వెళ్లిన రాథోడ్ సార్ మీరు లోపలికి వస్తేనే ఆ పెద్దాయన మిస్సమ్మను పంపిస్తారట. లేదంటే పంపించను అంటున్నారు అని చెప్పగానే అయితే పిల్లలను పిలువు రాథోడ్ మనం వెళ్లిపోదాం అంటాడు అమర్. దీంతో రాథోడ్ షాక్ అవుతాడు. మీరు ఇప్పుడు మిస్సమ్మను తీసుకుని వస్తారని ఇంటి దగ్గర పెద్ద సారు. మేడం ఎదురుచూస్తుంటారు. మిస్సమ్మ రాలేదని తెలిస్తే వాళ్లు ఎంత బాధపడతారో మీరు ఒకసారి ఆలోచించండి సార్. రాథోడ్ చెప్పగానే సరే అయితే పద లోపలికి వెళ్దాం అని అమర్ చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.