Double murdered: చిన్న జీవిని చంపాలంటే పాపం అని అంటాం. అలాంటి ఇద్దర్ని దారుణంగా చంపేశాడు ఓ వ్యక్తి. కత్తితో తల్లి-కొడుకుని నరికి నరికి చంపి తన కసి తీర్చుకున్నాడు. అప్పటికి గానీ నిందితుడి కోపం చల్లారలేదు. ఈ ఘటనతో భయంతో హడలిపోయారు స్థానికులు. సంచలనం రేపిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది.
రాయలసీమ వంటి ప్రాంతాల్లో పాత కక్షలు పురివిప్పుతాయని అప్పుడప్పుడు వింటుంటాం. అది ఆ ప్రాంతానికి పరిమితం కాలేదు. పాతకక్షలు నేపథ్యంలో నడిరోడ్డుపై చంపుకునే ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయ.
లేటెస్ట్‌గా సంగారెడ్డి జిల్లాలో అలాంటి ఘటన వెలుగుచూసింది. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం వీరభద్రనగర్ కాలనిలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగా రోడ్డుపై తల్లి, కొడుకులను కత్తితో పొడిచి చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ వ్యక్తి.
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అసలు స్టోరీ ఏంటి అన్న డీటేల్స్‌లోకి ఒక్కసారి వెళ్దాం. బొంతపల్లి గ్రామం వీరభద్రనగర్ కాలనిలో ఇరుగు పొరుగున నాగరాజు- అనిల్ కుటుంబాలు నివాసం ఉండేవి. అయితే ఆరు నెలల కిందట నాగరాజుకి చెందిన రెండేళ్ల బాలుడు నీటి సంపులో పడి మృతి చెందాడు. తన కుమారుడి మృతికి కారణం అనిల్ కుటుంబమే అని భావించాడు నాగరాజు. వాళ్ల ఫ్యామిలీపై కక్ష పెంచుకున్నాడు.
ALSO READ: ఇది ఎలుక లు రాసిన మరణ శాసనం.. ఇద్దరు చిన్నారుల మృతి.. ఏం జరిగిందంటే
November 14,2024
సీన్ కట్ చేస్తే.. నాగరాజు తమపై అనుమానంతో గొడవలు పెట్టుకుంటున్నాడని అనిల్ ఫ్యామిలీ భావించింది. ఆరునెలల కిందట ఆ గ్రామాన్ని వదిలి వెళ్లిపోయింది. మూడు రోజుల కిందట అనిల్ ఫ్యామిలీ తిరిగొచ్చింది. ఆనాటి అనిల్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు నాగరాజు.
రోజురోజుకూ కక్ష పెరిగిపోయింది.. కనిపిస్తే చంపేద్దామన్న స్టేజ్‌కి వెళ్లిపోయాడు నాగరాజు. రోజులు మారుతున్నాయి.. మనషుల మనసు ఏ మాత్రం మారలేదు. అనిల్ ఫ్యామిలీ మళ్లీ గ్రామంలోకి వచ్చిందన్న విషయం నాగరాజు చెవిలో పడింది. అప్పటివరకు కూల్‌గా నాగరాజు మనసులో చంపాలన్న ఆలోచన వచ్చింది.
సమయం కోసం వేచి చూశాడు. గురువారం ఉదయం 10 గంటలకు టూ వీలర్‌పై అనిల్, అతడి తల్లిని అడ్డగించాడు నాగరాజు. తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేసి వారిని పొడిచి పొడిచి చంపాడు. స్పాట్‌లో తల్లి-కొడుకులు రోడ్డుపై నెత్తురొడుతూ మృతి చెందారు.
అప్పటికి గానీ నాగరాజు కోపం చల్లారలేదు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్ కు తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్‌కి చెందినవారు కాగా, నిందితుడు బీహార్ వాసి.
సంగారెడ్డిలో డబుల్ మర్డర్..
అందరూ చూస్తుండగానే తల్లి, కొడుకులను కత్తితో నరికి చంపిన దుండగుడు
గుమ్మడిదల మండలం బొంతపల్లెలో ఘటన
పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు
పోలీసుల అదుపులో నిందితుడు@spsangareddy#SangaReddy #DoubleMurder #BigTV pic.twitter.com/GN8oyHwsAb
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2024