Tamil Nadu Tragedy : ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని చల్లిన మందు ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. వాళ్లు కలలో కూడా ఊహించని విధంగా.. అందరి జీవితాలు తారుమారైయ్యాయి. ఏ పిల్లల కోసం అయితే ఆలోచించి.. ఇంట్లోకి ఎలుకల మందు కొనుక్కుని రాలేదో.. చివరికి అదే మందు, ఆ పసి ప్రాణాల్ని పొట్టన పెట్టుకుంది. ఈ విషాద గాథ విన్నవాళ్లంతా.. అయ్యో అంటూ కన్నీళ్లు కార్చుతున్నారు. ప్రతీ హృదయాన్ని మెలిపెడుతున్న.. ఇద్దరు చిన్నారుల మరణం ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
కుంరదూర్ లోని దేవేంద్రనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫ్లాట్‌లో గిరిథరన్ (Giritharan), పవిత్ర (Pavithra) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లులు.. ఆరేళ్ల కుమార్తె విశాలిని(Vaishnavi), ఏడాది వయస్సున్న సాయి సుదర్శన్(Sai Sudarshan). తండ్రి గిరిథరన్. కుంరదూర్ లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ కుటుంబాన్ని.. ఎలుకల మందు రూపంలో మృత్యువు వచ్చింది. సంతోషంగా ఉండే వారి జీవితాల్లో తెల్లారే సరికి విషాథ ఛాయలు అలుముకున్నాయి.
వీరి ప్లాట్ లో ఎలుకల బెదడ ఎక్కువగా ఉంది. దాంతో.. ఎలుకల్ని పట్టే జిగురు అట్టాను తీసుకువచ్చారు. కానీ.. దాని మీద పిల్లలు చేతులు పెడుతున్నారని, దాంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆపేసారు. తర్వాత ఎలుకల మందు తీసుకురావాలి అనుకున్నారు. చిన్న పిల్లలున్న ఇంట్లో.. ఆ రసాయనాలు ప్రమాదకమని భావించి వద్దనుకున్నారు. అప్పుడే.. ఎలుకల మందు పిచికారీ చేయడంలో అనుభవమున్న ఎదైనా సంస్థ, వ్యక్తులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పిల్లలకు ఎలాంటి అపాయము లేకుండా చూసుకోవాలన్నది వారి ఆలోచన.
గిరిథరన్ బ్యాంకులోనూ ఎలుకల బెడద ఉండగా, ఓ ప్రైవేట్ సంస్థతో రసాయనాలు పిచికారీ చేయించారు. ఆ వ్యక్తులతో గిరిథరన్ కు పరిచయం ఏర్పడడంతో.. వారిని పిలిచి, ఎలుకల మందు పిచికారీ చేయాలని కోరారు. దాంతో.. ఇద్దరు వ్యక్తులు వచ్చి, ఎలుకల మందు పిచికారీ చేసి వెళ్లారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలో.. రాత్రి వేళ మందు వాసన పీల్చిన కుటుంబ సభ్యులు తెల్లవారే వరకూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందరికీ.. వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో కేకలు వేయడంతో స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
రసాయనాల మోతాదు ఎక్కువ కావడంతో.. చికిత్స పొందుతూ కుమార్తె విశాలిని, కుమారుడు సాయి సుదర్శన్‌లు మృతి చెందారు. గిరిథరన్, పవిత్రల ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో.. చికిత్స నిమిత్తం మరో పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు.. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.కాగా.. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయమై.. కుంరత్తూరు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోద చేసిన పోలీసులు.. ఇద్దరు చిన్నారుల మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి
Also Read : కర్నాటకలో హత్య.. ఏపీలో మృతదేహం.. నింధితులను పట్టించిన డోర్ కర్టన్!
కుంరత్తూరు పోలీసులు ఇద్దరు చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో ఎలుకల మందు పిచికారీ చేసిన వారిలో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.