BigTV English

Lover Cheats Wedding: ప్రియుడి కోసం ఎదురుచూస్తూ కుప్పకూలిన పెళ్లికూతురు.. భర్తను మోసం చేసి..

Lover Cheats Wedding: ప్రియుడి కోసం ఎదురుచూస్తూ కుప్పకూలిన పెళ్లికూతురు.. భర్తను మోసం చేసి..

Lover Cheats Wedding| చాలా సార్లు ఎంతో ఆడంబరంగా జరిగే వివాహాలు మధ్యలోనే ఆగిపోతుంటాయి. ఏదో చిన్న కారణం వల్ల జరగాల్సిన శుభకార్యం ఇక జరగదు. అలాంటి ఘటన ఒకటి తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. అక్కడ ఒక గ్రామంలో మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులు రాలేదు. అతని కోసం ఎదరుచూస్తూ.. పెళ్లి కూతురు స్పృహ తప్పి పడిపోయింది. పెళ్లిలో దాదాపు 300కు పైగా అతిథులు వచ్చారు. వారంతా పెళ్లికూతురు చేసుకున్న పాపమే వల్లే ఇదంతా జరిగిందని దూషించి వెళ్లిపోయారు.


వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంభల్ జిల్లాలోని నఖాసా గ్రామానికి చెందిన గుడ్డీ దేవి అనే 24 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం రమాకాంత్ (26) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరిదీ పెద్దలు నిశ్చయించిన వివాహం. అయితే గుడ్డీ దేవి తన భర్తను మోసం చేసి తన పట్టింటికి సమీపంలో ఉన్న సలీం అనే యువకుడిని ప్రేమించేది. కొంత కాలం తరువాత ఈ విషయం ఆమె భర్త రమాకాంత్ కు తెలిసిపోయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.

ఒకరోజు ఇంటి నుంచి పనిమీద రమాకాంత్ బయటికి వెళ్లగానే సలీం వారింట్లోకి చొరబడ్డాడు. ఆ తరువాత గుడ్డీదేవి, సలీం శృంగారం చేసుకుంటూ ఉండగా.. రమాకాంత్ అనుకోకుండా తిరిగివచ్చాడు. దీంతో రమాకాంత్ ఇద్దరినీ చితకబాదాడు. ఈ క్రమంలో వారిద్దరినీ రమాకాంత్ హత్య చేసేంతవరకు ప్రయత్నించాడు. కానీ ఎలాగోలా సలీం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత గుడ్డీ దేవి తల్లిదండ్రులపై రమాకాంత్ కుటుంబసభ్యులు కోర్టులో కేసు వేద్దామని ప్రయత్నించారు. కానీ ఊరి పంచాయితీ పెద్దలు కలుగజేసుకొని అలా జరగకుండా ఆపారు.


గ్రామ పంచాయితీలో గుడ్డీ దేవి తాను పెళ్లికి ముందు నుంచే సలీమ్ ను ప్రేమించానని, తల్లిదండ్రులే తనకు బలవంతంగా ఈ పెళ్లి చేశారని తెలిపింది. అందరి వాదనలు విన్న గ్రామ పంచాయితీ రమాకాంత్ కు ముందు విడాకులు ఇవ్వాలని గుడ్డీ దేవికి చెప్పారు. ఆ తరువాత సలీంతో వివాహం చేసుకోవాలని తీర్పు చెప్పారు. దీంతో రమాకాంత్, గుడ్డీదేవి విడాకులు తీసుకున్నారు.

మరోవైపు గుడ్డీదేవి, సలీం కుటంబ సభ్యులు కూడా పెళ్లికి అంగీకరించారు. కానీ సలీం తల్లిదండ్రులు కట్నం కింద కారు ఇవ్వాలని షరతు విధించారు. అందుకు గుడ్డీదేవి తండ్రి అంగీకరించాడు. అలా నవంబర్ 5వ తేదీన పెళ్లికి రావాలని గ్రామస్తుందరికీ ఆహ్వానం అందింది.

నవంబర్ 5న గుడ్డీ దేవికి పెళ్లి కూతురుగా అందంగా ముస్తాబై తన ప్రియుడు సలీం కోసం ఎదురుచూస్తూ కూర్చొని ఉంది. ముహూర్తం దాటిపోయి రెండు గంటలైనా పెళ్లికొడుకు సలీం, అతని కుటుంబ సభ్యులెవరూ రాలేదు. ఇంతలో సలీం స్నేహితుడు అక్కడికి వచ్చి కట్నం కింద అనుకున్న కారు ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. దీంతో గుడ్డీదేవి షాక్ కు గురై స్పృహ కోల్పోయింది. ఆమె పరిస్థితి చూసి పెళ్లి వచ్చిన 300 మంది గ్రామస్తులంతా ఆమెనే తిట్టిపోశారు. మంచి భర్తను కాదని దుర్మార్గుడిని ప్రేమించినందుకు తగిన శాస్తి అయిందని చెప్పి అక్కడి నుంచి భోజనం చేయకుండా వెళ్లిపోయారు.

రెండు రోజుల తరువాత గుడ్డీదేవి ఆస్పత్రి నుంచి కోలుకొని వచ్చింది. గుడ్డీదేవి, ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు సలీం కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేశారు. కట్నం వేధింపులు కేసు, పెళ్లి రద్దు చేయడం ద్వారా తమకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని పోలీసులను కోరారు. సలీం కుటుంబసభ్యులపై కట్నం వేధింపుల కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ సలీం పరారీలో ఉన్నట్లు సమాచారం.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×