OTT Movie : ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో మలయాళం సినిమాల హవా నడుస్తోంది. మంచి కంటెంట్ తో వస్తున్న మలయాళం సినిమాలను మూవీ లవర్స్ బాగా ఆదరిస్తున్నారు. మలయాళం ఇండస్ట్రీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని ప్రస్తుతం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “తంకం” (Thankam). హీరో బంగారం విక్రయిస్తూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఒకసారి కొంత బంగారంతో పోలీసులకు దొరకడంతో ఈ మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీలో ట్విస్టులు చాలానే ఉంటాయి. బీజు మీనన్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరో బంగారంతో నగలను తయారు చేస్తూ ఉంటాడు.హీరోకి కన్నన్ అనే స్నేహితుడు ఈ వ్యాపారంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఇతర భాషలలొ ప్రావీణ్యం ఉండటంతో అక్కడకూడా బంగారాన్ని అమ్ముతూ ఉంటాడు. వీరిద్దరూ బంగారాన్ని ఇల్లీగల్ గా కూడా విక్రయిస్తూ ఉంటారు. ఒకసారి బంగారాన్ని కొనడానికి ముంబై నుంచి ఒక పెద్ద ఆర్డర్ వస్తుంది. హీరోని ఒక హోటల్లో పార్టీ చేసుకోమని ఆ బంగారాన్ని తీసుకొని కన్నన్ ముంబై బయలుదేరుతాడు. మార్గమధ్యంలో ఆ కార్ ని పోలీసులు పట్టుకుంటారు. అయితే అంతలోపే ఆ బంగారాన్ని కన్నన్ వేరే వ్యక్తితో అక్కడినుంచి పంపిస్తాడు. పోలీసులకు అనుమానం వచ్చి కన్నన్ ను ఇంటరాగేట్ చేస్తుంటారు. ఈ విషయం హీరోకి తెలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులతో ఒక డీల్ మాట్లాడుకుంటాడు. అలా హీరో పోలీసులకు కొంత డబ్బులు ఇచ్చి కన్నన్ ని బయటికి విడిపించుకొని తీసుకొస్తాడు. బయటకు వచ్చిన కన్నన్ బంగారంతో మహారాష్ట్రకి బయలుదేరుతాడు.
ముంబైలో ఒక హోటల్లో స్టే చేసి మరుసటి రోజు బంగారాన్ని డెలివరీ చేయాలనుకుంటాడు. అయితే ఆ మరుసటి రోజు కన్నన్ రక్తపు మడుగులో చనిపోయిఉంటాడు. హీరోకి కన్నన్ చనిపోయాడని పోలీసులు ఫోన్ చేసి చెప్తారు. చనిపోయిన వ్యక్తిని ఎవరో తెలిసిన వ్యక్తే చంపిఉంటాడని పోలీసులు అనుమానిస్తారు. అతడు బయలుదేరినప్పటి నుంచిఎవరైనా రహస్యంగా ఫాలో అవుతూ ఉండొచ్చని, అతడు వెళ్ళిన దారిలో ఎంక్వయిరీ చేయాల్సి ఉంటుందని పోలీసులు హీరోకి చెప్తారు. ఈ క్రమంలో పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలుస్తాయి. ఇంతకీ కన్నన్ ను చంపింది ఎవరు? బంగారం కోసమే అతనిని చంపారా? హీరోకి ఈ హత్య కేసులో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న తంకం “(Thankam) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీలో క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. దృశ్యం లాంటి సినిమాలకు మలయాళం ఇండస్ట్రి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.