Maharashtra Crime News: న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వల్‌సంగ్కర్ ఆత్మహత్య వెనుక అసలేం జరిగింది? ఆయన సూసైడ్ వెనుక ఎవరైనా ఉన్నారా? ఇప్పటికే ఆసుపత్రి స్టాప్‌లో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనది హత్యా? ఆత్మహత్యా అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అసలేం జరిగింది.
అసలేం జరిగింది?
షోలాపూర్ పట్టణంలో ఫేమస్ వైద్యుడు. న్యూరో స్పెషలిస్ట్ డాక్టర్ శిరీష్ వలసంగకర్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన వయస్సు 65 ఏళ్లు. శిరీష్ వలసంగకర్ ఫ్యామిలీ మొత్తం వైద్యులు. మూడున్నర దశాబ్దాలుగా పట్టణంలో ఏకైక న్యూరో సర్జన్. ఆయన మరాఠీ, కన్నడ, హిందీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతారు. ఇటీవలే వరల్డ్ మెడికల్ టూర్ కోసం డబల్ ఇంజన్ డైమండ్ ప్లేన్ కొనుగోలు చేశారు. అంతలోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టారు.
శుక్రవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో డాక్టర్ శిరీష్ వల్‌సంగ్కర్ తన నివాసంలో రివాల్వర్‌తో తలపై కాల్చుకుని మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో కూతురు ఉమ ఇంట్లోనే ఉన్నారు. తుపాకీ శబ్దం విన్న వెంటనే కుటుంబ సభ్యులు ఆయన బెడ్రూంలోకి వెళ్లి చూడగా కొన ఊపిరితో ఉన్నారు. ఇరుగు పొరుగు వెంటనే ఆయన్ని రామ్‌వాడి ప్రాంతంలోని సొంత ఆసుపత్రికి తరలించారు.
ఫ్యామిలీ అంతా వైద్యులే
ఆయన కొడుకు డాక్టర్ అశ్విన్, కోడలు డాక్టర్ సోనాలి, ఇతర డాక్టర్లు ఆయనను కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు రాత్రి పదిన్నర గంటల సమయంలో మరణించినట్లు డాక్టర్లు నిర్థారించారు. డాక్టర్ శిరీష్ మరణంపై ప్రముఖులు, వైద్య నిపుణులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ALSO READ: బిడ్డకు విషమిచ్చి తాను కూడా తాగి, ప్రగతి నగర్‌లో ఓ తల్లి కఠిన నిర్ణయం
న్యూరాలజీ రంగంలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సోలాపూర్‌లో దాదాపు 30 ఏళ్లుగా ఆయన సేవలు అందించారు. ఆయన సోలాపూర్‌కి కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన వైద్య సేవలను అందించారు. అతను నిద్ర నుంచి లేచి లైసెన్స్ రివాల్వర్‌ను తీసుకుని బాత్రూమ్‌కు వెళ్లాడు. అక్కడ తలపై కాల్చుకుని కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఆ మహిళే కారణమా?
సోలాపూర్‌లో డాక్టర్ వీఎం మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. శివాజీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్, ఎండీ చదివారు. తన నైపుణ్యాన్ని మరింత పెంచుకోవడానికి లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ నుండి ఎంఆర్సీపీ సాధించారు.
కేసు విషయానికి వస్తే డాక్టర్ శిరీష్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఓ మహిళపై కేసు నమోదు అయ్యింది. ఆయన ఆసుపత్రిలో ఆమె పరిపాలన విభాగంలో పని చేస్తున్నారు. ఆమె పేరు మనీషా ముసలే. ఆత్మహత్యకు ముందు డాక్టర్ శిరీష్ ఓ లేఖ రాశారు. ఆయన ఆత్మహత్య వెనుక ఆ మహిళ కారణమనే వార్తలు జోరందుకున్నాయి.