Rashmika – Vijay Deverakonda: రూమర్డ్ లవ్ బర్డ్స్ గా సినీ ఇండస్ట్రీలో చలామణి అవుతున్న రష్మిక (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వీరిద్దరూ కలిసి ‘గీతాగోవిందం’ సినిమా ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.. ఈ సినిమాలో వీరి నటనను చూసి ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య పరిచయం ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత ఎక్కడ చూసినా ఈ జంటే కనిపించింది. దీనికి తోడు వెకేషన్ కి వెళ్లడం, టూర్లకు వెళ్లడం లాంటివి చేశారు. దీనికి తోడు ఎవరు ఐడెంటిఫై చేయకుండా అటు ఎయిర్పోర్ట్ లో కూడా ఒకరి తర్వాత ఒకరు కనిపించి బాగానే మేనేజ్ చేశారు.కానీ ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు కదా ఇట్టే వీరిని పట్టేశారు.
ఇంకెన్నాళ్లో ఈ దాగుడుమూతలు..
దీనికి తోడు వీరిద్దరూ కలిసి పలు వెకేషన్ లకి సంబంధించిన ఫోటోలను విడివిడిగా షేర్ చేసినా బ్యాక్ గ్రౌండ్ మాత్రం వీరిద్దరూ ఒకే చోట ఉన్నట్టు చూపించింది.ఇదిలా ఉండగా మరోవైపు ఒకే తరహా డ్రెస్సులో కనిపించడం లేదా విజయ్ వేసుకున్న టీ షర్టు రష్మిక వేసుకోవడం, లేదా రష్మిక ధరించిన క్యాప్ విజయ్ దగ్గర ఉండడం లాంటివి ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ప్రతి చిన్న ఈవెంట్లో కూడా రష్మిక దర్శనం ఇస్తూ ఉంటుంది. దీనికి తోడు విజయ్ దేవరకొండ తమ్ముడితో నువ్వు నా మరిదివి, నా ఇంటి వాడివి అంటూ కూడా హింట్ ఇస్తూ కామెంట్లు చేసింది. అటు విజయ్ దేవరకొండ కూడా నేను ఇంకా సింగిల్ గా ఉన్నానని మీరు అనుకుంటున్నారా ? అంటూ కూడా అడిగారు. ఇక ఇవన్నీ చూస్తుంటే వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంటుందా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు రకాల కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.
సేమ్ డ్రెస్ లో విడివిడిగా కనిపించి మళ్లీ దొరికిపోయిన జంట..
అయితే ఇప్పుడు సడన్ గా గత కొన్ని రోజుల క్రితం రష్మిక ఒక షర్ట్ వేసుకొని ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. ఇప్పుడు అదే షర్టు విజయ్ దేవరకొండ ధరించి ఉండటంతో అనుమానాలు మరింత బలమవుతున్నాయి. ఇది చూసిన ఆడియన్స్ ఇక చాలు ఈ దాగుడుమూతలు.. ఇకనైనా ఓపెన్ అవ్వండ్రా.. మీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్టు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు ఈ క్యూరియాసిటీ పెంచుతూ సడన్ గా చివరి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. ఏదేమైనా రూమర్డు లవ్ బర్డ్స్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట రివీల్ అవ్వాలని, పెళ్లి చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి పెళ్లి చేసుకుంటారా లేక చివర్లో అందరిలాగే ట్విస్ట్ ఇచ్చి స్నేహితులమని తప్పించుకుంటారా..?అన్నది తెలియాల్సి ఉంది. ఇక రష్మిక ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారగా .. అటు విజయ్ దేవరకొండ మాత్రం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు
Also Read:Raj Tarun – Lavanya: షాకింగ్ వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. దీంతో రాజ్ తరుణ్ అడ్డంగా దొరికినట్టే..?
Nice shirt raa 👀👀🤍#Virosh #RashmikaMandanna #VijayDeverakonda pic.twitter.com/vx9N0vIdUR
— Virosh trends (@rowdyrashmika) April 19, 2025