Bengaluru: మద్యం మత్తులో పురుషులు వీధుల్లో గందరగోళం సృష్టించడం వింటూ ఉంటాం. చాలా ఏరియాల్లో ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ బెంగళూరు సిటీలో శనివారం రాత్రి తాగిన మత్తులో ఇద్దరు యువతులు గందరగోళం సృష్టించారు. అంతేకాదు క్యాబ్ డ్రైవర్‌ని కొట్టినట్టు తెలుస్తోంది. అసలేం జరిగింది?
బెంగుళూరులో అర్ధరాత్రి రెచ్చిపోయిన ఇద్దరు యువతులు
శనివారం రాత్రి బెంగళూరులో ఇద్దరు యువతులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. టూ వీలర్‌తో ఓ క్యాబ్‌ని ఢీకొట్టారు. ఆ తర్వాత డ్రైవర్‌పై దాడికి దిగే ప్రయత్నం చేశారు. ఫుల్లుగా తాగిన ఇద్దరు యువతులు తమ వాహనంతో ఓ క్యాబ్‌ని బలంగా ఢీకొట్టారు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో ఇద్దరు యువతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వీకెండ్ కావడంతో బెంగుళూరు సిటీలోని ఇద్దరు యువతులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. తమ స్నేహితులను చూడటానికి వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా.. దారిలో ఓ క్యాబ్‌ని ఢీ కొట్టారు. వెంటనే కారు ఆపిన డ్రైవర్ అహ్మద్.. ఘటన గురించి వారిని ప్రశ్నించాడు. దీంతో డ్రైవర్-యువతల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అంతేకాదు ఆ సమయంలో మహిళలు అతడ్ని దుర్భాషలాడారు.
క్యాబ్‌ని ఢీ కొట్టి.. ఆపై డ్రైవర్‌పై దాడి, పోలీసుల అదుపులో యవతులు
చివరకు హెల్మెట్‌తో కొట్టేందుకు ప్రయత్నించారు. ఈలోగా అక్కడి చుట్టుపక్కన ప్రజలు రావడంతో ఆ వివాదం మరింత రచ్చ అయ్యింది. పరిస్థితిని అదుపు చేయడానికి వచ్చిన స్థానికులపై యువతులు దాడి చేసినట్టు ఆరోపణలు లేకపోలేదు. పరిస్థితిని గమనించి కొందరు వ్యక్తులు ఆ మహిళలపై దుర్భాషలాడుతూ అరవడం కనిపించింది.
ఆ ఫుటేజీలో ఓ మహిళ ఓ వ్యక్తిపై దాడి చేయడం కనిపించింది. వివాదం పెద్దదిగా మారడంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. రంగంలోకి దిగిన పోలీసులు, వారిని వాహనంలోకి ఎక్కించిన తర్వాత కూడా జనంపై దుర్భాషలాడుతూ అరుస్తూనే కనిపించింది. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేశారు.
ALSO READ: భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
ఈ వీడియో చూసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం మత్తులో ఉంటే ఈ విధంగా వ్యవహరిస్తారా? ఇలాంటి వారిని అస్సలు ఉపేక్షించకూడదని డిమాండ్ చేస్తున్నారు. వీరివల్ల ఏ తప్పు చేయనివారు ప్రమాదాలకు గురవుతారని అంటున్నారు. నగరంలో ఇలాంటివి మళ్లీ జరగకుండా యువతులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Drunk Bengaluru Women Crash Into Cab, Hit Driver With Helmet, Abuse Crowd
Drunk women allegedly created a public nuisance after ramming their two-wheeler into a cab from behind while returning from visiting friends. The cab driver, identified as Ahmed, questioned them about the… pic.twitter.com/mpOi2QoW4M
— Karnataka Portfolio (@karnatakaportf) February 8, 2026