E-Paper
Advertisement

Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!

Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో మద్యం మత్తులో కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. మాదాపూర్‌లోని గూగుల్ ఆఫీస్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న యువకులు అతివేగంగా కారు నడుపుతూ, అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదకరంగా ఓవర్ టేక్ చేశారు. అంతటితో ఆగకుండా.. బస్సుకు అడ్డంగా కారును నిలిపి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు.

ఈ గొడవ కాస్తా ముదిరి, యువకులు బస్సు డ్రైవర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారు. పట్టపగలే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు చూస్తుండగానే.. యువకులు ఆవేశంతో బస్సుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ముందు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో వారు చేస్తున్న రచ్చను ఆపడానికి ప్రయత్నించిన వారిని కూడా యువకులు దుర్భాషలాడినట్లు సమాచారం.

Advertisement

ఈ ఘటనపై బాధితుడైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులు మద్యం సేవించి వాహనం నడపడమే కాకుండా, ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని, విధుల్లో ఉన్న తనపై దాడి చేశారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Also Read: పర్యాటకులకు బంపర్ ఆఫర్.. ఇకపై వాట్సాప్‌లోనే టూర్ టికెట్స్.. ఎలాగో తెలుసా?

Advertisement

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×