E-Paper
Advertisement

East Godavari Crime: తూర్పులో దారుణం, మహిళను రేప్ చేసి, ఆపై దారుణంగా..

East Godavari Crime: తూర్పులో దారుణం, మహిళను రేప్ చేసి, ఆపై దారుణంగా..
Advertisement

East Godavari Crime: కామాంధులు, గంజాయి బ్యాచ్ గ్యాంగ్ రెచ్చిపోతోంది. మత్తులో ఎవరినీ వదల్లేదు. ఆడపిల్ల, మహిళ కనిపిస్తే చాలు, కళ్లు కామంతో మూసుకు పోతున్నాయి. లేటెస్ట్‌గా తూర్పుగోదావరి కడియం నర్సరీలో దారుణం చోటు చేసుకుంది.

అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.. ఒడిషాలోని పర్లాకిమిడికి చెందిన 43 ఏళ్ల మహిళ ఫ్యామిలీ కూలి పనుల కోసం తూర్పుగోదావరి జిల్లా బుర్రిలంక ప్రాంతానికి కూలి పనుల నిమిత్తం వచ్చింది. నర్సరీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈమెకి ఓ కూతురు, ఓ కొడుకు ఉన్నారు.

Advertisement

అక్టోబర్ 15న కూలి పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరింది. బుర్రిలంకకు చెందిన నలుగురు యువకులు ఆమెని అడ్డగించి తమ కోరిక తీర్చమని బలవంతం చేశారు. బాధితురాలు ప్రతిఘటించడంతో చెట్ల వద్దకు తీసుకెళ్లి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఈ ఘటన అదే రోజు రాత్రి 9 గంటలకు జరిగినట్టు తేలింది. ఆ తర్వాత ఆమెని చంపేసి గోదావరి సమీపంలోని పంట కాలువలో పడేశారు. అక్టోబర్ 16న మహిళ మిస్సింగ్ అయ్యిందంటూ కడియం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

Advertisement

ALSO READ: గంజాయి స్మగ్లింగ్.. పోలీసులే సూత్రధారులు.. తలలు పట్టుకున్న ఉన్నతాధికారులు

ఘటన జరిగి రెండు రోజుల తర్వాత గోదావరి కాలువలో మహిళ మృత దేహాన్ని గుర్తించారు. మృతురాలు పని చేసిన నర్సరీ వద్ద ఆమె నల్లపూసల దండ, గాజులు కనిపించాయి. ఈ వివరాలు మహిళ బంధువులు పోలీసులకు ఇచ్చారు. దీంతో కడియం మండలంలోని నర్సరీల్లో పని చేసిన మహిళల గురించి ఆరా తీశారు.

ఘటన తర్వాత నర్సరీలో పనులకు హాజరుకాని వారిపై ఆరా తీశారు. అందులో ఓ వ్యక్తి రాలేదని గుర్తించారు. బుర్రిలంకకు చెందిన దేవర యేసు. వాడ్ని పట్టుకుని తమదైన శైలిలో ట్రీట్‌మెంట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇచ్చిన ఆధారాలతో మిగతా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరంతా గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు పోలీసులకు వివరించారు. ఘటన తర్వాత మహిళను హత్య చేశారా? అప్పటికే ఆమె మృతి చెందిందా? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తేలనుంది. తల్లి ఫోటోను పట్టుకుని కొడుకు, కూతురు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×