BigTV English

Dulquar Salmaan : లక్కీ భాస్కర్ సినిమాలో వాడింది నా పర్సనల్ కార్ 

Dulquar Salmaan : లక్కీ భాస్కర్ సినిమాలో వాడింది నా పర్సనల్ కార్ 

Dulquar Salmaan : మూడు హిట్ సినిమాలు చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కి ఉన్న గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది పరభాష నటులను పరభాష హీరోలను తెలుగు అభిమానులు ఆదరించి మంచి హిట్ సినిమాలు ను వాళ్లకు ఇచ్చారు. ఇప్పటికీ కూడా చాలామంది తమిళ్ హీరోస్ ను విపరీతంగా ఆదరిస్తూ ఉంటారు. ఒక తెలుగు సినిమాకి ఎలా అయితే బ్రహ్మరథం పడతారో ఇతర భాషలో సినిమా కూడా అదే విధంగా బ్రహ్మరథం పడతారు. ముఖ్యంగా ఆ సినిమా బాగుంటే పదిమంది వద్దకు ఆ సినిమాను మోసుకెళ్తారు కూడా. ఇక మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్ట్రైట్ గా తెలుగులో సినిమాలు చేయడం మొదలుపెట్టారు.


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో కనిపించారు దుల్కర్. ఇది విలన్ పాత్ర అయినా కూడా నాగ అశ్విన్ పాత్రను చూపించిన విధానం విపరీతంగా ఆకట్టుకుంది. దుల్కర్ కు ఈ సినిమా మంచి ప్లస్ అయింది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ప్రశంసలు అందుకోవడంతోపాటు కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత దుల్కర్ చేసిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో పడినప్పుడు నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా డీసెంట్ గా వస్తున్నాయి. అయితే దుల్కర్ కి కార్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు దాదాపు దుల్కర్ దగ్గర 70 కారుల వరకు ఉన్నాయి. చాలా కార్లను హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఇంట్లో లో పార్క్ చేశాడు కూడా.

Trivikram Political Movie: పొలిటికల్ డ్రామా తీయాలంటే అది ఇప్పుడు త్రివిక్రమ్ చేతిలోనే ఉంది


ఒక లక్కీ భాస్కర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఈవెంట్లో త్రివిక్రమ్ “ఒక మిడిల్ క్లాస్ వాడు గెలిస్తే చూడ్డానికి బాగుంటుంది” అని చెప్పినట్లు అందరికీ అదే అభిప్రాయం కలిగింది. అయితే ఈ సినిమాలో దాదాపు చాలా కారులను చూపించారు. వీటిలో దుల్కర్ కి ఏదైనా కారు నచ్చిందా అని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ లో అడిగినప్పుడు. ఈ సినిమాలో నా కారుని ఉపయోగించారు అంటూ తెలిపాడు. ఈ సినిమాలో రెడ్ కలర్ లో కనిపించిన నిషాన్ పాట్రోల్ కార్ తన సొంతదే అంటూ రివిల్ చేశాడు దుల్కర్. కార్ డ్రైవింగ్ విషయంలో కూడా దుల్కర్ పైన మమ్ముట్టికి కంప్లైంట్ చేశారు బాలకృష్ణ. బాలయ్య ఎంత స్పీడ్ తో వెళ్తావు అని అన్ స్టాపబుల్ షో లో దుల్కర్ ను అడిగినప్పుడు.. 300 స్పీడ్ తో వెళ్తాను అని చెప్పినప్పుడు బాలకృష్ణ షాక్ అయ్యారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×